అయితే వైసీపీ మౌత్ పీస్‌గా పేర్కొనే ప్రముఖ తెలుగు మీడియా సాక్షి మాత్రం ఆయన పాదయాత్రపై విమర్శలు గుప్పించింది. సాక్షి టీవీ పవన్ పడిన అవస్థను "ఓవరాక్షన్" అని పిలిచింది. "తిరుమల ట్రిప్‌పై పవన్ కళ్యాణ్ ఓవరాక్షన్" అనే టైటిల్ తో టార్గెట్ చేసే ఒక ఆర్టికల్ రాసింది. ఆయన పాదయాత్ర వల్ల అలిపిరి మెట్ల మార్గం 30 నిమిషాలపాటు మూతపడిందని, దీంతో ప్రజలకు అసౌకర్యం కలిగిందని మీడియా పేర్కొంది.
సాక్షి విమర్శలపై టీడీపీ తమ్ముళ్లు వేరే రేంజ్ లో ఫైర్ అవుతున్నారు. పవన్ కళ్యాణ్ అభిమానులతో కలిసి సాక్షి తీరును ఎండగడుతున్నారు. సాక్షి మీడియా అన్యాయంగా మాట్లాడుతుందంటూ వారు తీవ్రమైన వ్యాఖ్యలు చేస్తున్నారు. ఒక టీడీపీ కూటమి యాక్టివిస్ట్ ట్వీట్ చేస్తూ, “జగన్ తిరుమలకు పాదయాత్ర చేసి ఉంటే, సాక్షి అతనిని ప్రశంసించేది. ఈ పులివెందుల ఎమ్మెల్యే జగన్ కోసం అలిపిరి మార్గాన్ని రెండు గంటలు మూసివేసినా సాక్షి మాత్రం దాని గురించి ఏమాత్రం మాట్లాడకపోయి ఉండేది." అని ధ్వజమెత్తారు.
డిప్యూటీ సీఎం పవన్ కోసం కేవలం 30 నిమిషాల పాటు అలిపిరి మెట్ల భాగాన్ని మూసి వేయగా.. దాన్ని పెద్ద ఇష్యూ చేసింది సాక్షి. "ప్రజల ఎదురుదెబ్బకు భయపడి జగన్ తన యాత్రను రద్దు చేసుకున్నారని, ఇప్పుడు ఆయన మీడియా జనసేన అధినేత పవన్‌పై విరుచుకుపడుతోంది." అని ఇంకొకరు కౌంటర్ ఎటాక్ చేశారు.