రాష్రంలో పలు నియోజకవర్గాలలో ఎమ్మెల్యేలపై తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్న పార్టి క్యాడర్. అలాంటి నియోజకవర్గాలలో జరుగుతున్న పరిణామాలపై దృష్టి సారించి చర్యలకు సిద్దమైన టిడిపి హైకమాండ్. సమస్యలు ఉన్న నియోజకవర్గాలలో మండలాల వారీగా పార్టి కోసం కష్టపడిన నాయకులను గుర్తించి త్రీమెన్  కమిటీలు వేసే దిశగా అడుగులు వేస్తున్న టిడిపి అధినేత. పార్టి కోసం ఎవరు కష్టపడ్డారు, పార్టి కష్టాల్లో ఉన్నప్పుడు ఎవరు ఆర్ధికంగా అండగా నిలిచారు, ఏ నాయకుడు ఎంతమేర పార్టి కోసం పనిచేశారు అనేది పూర్తి సైంటిఫిక్ డేటా అధినేత తన వద్ద ఉంచుకోని అంతర్గతంగా సమీక్షిస్తున్నారు. దీంతో సమస్యలు ఉన్న నియోజకవర్గాలలో ఎమ్మెల్యేలకు ఝలక్ తప్పదని విశ్లేషకులు బావిస్తున్నారు.


ఏ నాయకుడిని, కార్యకర్తని పార్టీకి దూరం కానివ్వడానికి వీలు లేదు అని, ఏ స్ధాయి నాయకుడికి అయినా నష్టం జరగడానికి వీలు లేని విధంగా యాక్షన్ ప్లాన్ సిధ్దం చేస్తున్న టిడిపి హైకమాండ్. 2014-2019 మధ్య‌ తరహాలో శాసనసభ్యుల మీద పార్టిని వదిలేసి నష్టపోయిన పరిస్ధితి కనపడింది. మరలా అదేవిధంగా వ్యవహరిస్తే కొన్ని నియోజకవర్గాలలో ఎమ్మెల్యేలు చేసే అరాచకాలు, అక్రమ సంపాదన, క్యాడర్ ని నిర్లక్ష్యం చేయడం వంటి చర్యలతో రాబోయే ఎన్నికలలో పార్టి తీవ్రంగా నష్టపోతుంది అని అధిష్టానం బావిస్తుంది.


ముఖ్యంగా పార్టీ సెంట్రల్ ఆఫీసుకి కనుక ఎమ్మెల్యే వలన ఇబ్బంది పడుతున్నాం అని గాని, ఏదైనా సమస్య ఎమ్మెల్యే పరిధిలో ఉన్నప్పటికి కూడా పరిష్కరించలేకపోవడం , కొన్ని చోట్ల కార్యకర్తలు ఆగ్రహాలతో కట్టలు తెంచుకోని రోడ్లపైకి రావడం, మీడియా ముందు వారి ఆవేదన వెలిబుచ్చడం వంటి వాటి గురించి సదరు ఎమ్మెల్యే లపై చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మీరు మీ నియోజకవర్గాలలో సమన్వయం చేసుకోలేకపోవడం వలనే కదా వారు సెంట్రల్ ఆఫీసు వరకు వచ్చి వేడుకుంటున్నారు, దీని పై సదరు ఎమ్మెల్యే లను ఉద్దేశించి "ఇంత అసమర్ధంగా ఉన్నారా, ఒంటెద్దుపోకడ మంచిది కాదు అని ఆ ఎమ్మెల్యేలపై  అధినేత ఆగ్రహిస్తున్నారు.


రాజకీయాలలో భేదాబిప్రాయాలు ఉండటం సహజం, వాటిని చర్చించుకోని సమన్వయం చేసుకోవాలి, అంతే కానీ క్యాడర్ ను  గాలికి వదిలేస్తా అంటే పార్టి హైకమాండ్ చూస్తూ ఊరుకోదు అని కొందరు సీనియర్ నేతలకు బాబు చురకలు అంటించారు అని తెలిసింది. దీంతో కొందరి ఎమ్మెల్యేల పనితీరును పార్టి ఇంటిలిజెన్స్ టీంల ద్వారా సమాచారాన్ని అధినేత ఇప్పటికే తెప్పించుకున్నారు. కొంత సమయం వేచిచూసి సరిదిద్దుకుంటారా సరే, లేదంటే పార్టి సొంత యాక్షన్ ప్లాన్ తో నియోజకవర్గాలలో పార్టిని క్యాడర్ ని బలోపేతం చేయాలనే ఆలోచనతో ఉన్నారు.


విజయదశమి తరువాత దీనిపై అధినేత పార్టి ముఖ్య నేతలతో చర్చించి ముందుగా మరీ క్యాడర్ ఎక్కువగా ఇబ్బంది పడుతున్న ఓ పది నియోజకవర్గాలలో దీన్ని అమలు చేయాలని బావిస్తున్నారు.
అధినేత ఇలాంటి నిర్ణయాలు తీసుకోని కార్యకర్తలను క్యాడర్ ను కాపాడటం  మున్ముందు కూడా పార్టికి మంచి రోజులు ఉంటాయి అని టిడిపి క్యాడర్ హర్షం వ్యక్తం చేస్తున్నారు..

మరింత సమాచారం తెలుసుకోండి: