- ప‌లువురు కీల‌క నేత‌లు జంప్‌
- ఇప్ప‌ట్లో ఆగ‌ని వ‌ల‌స‌లు .. !

- ( గోదావ‌రి - ఇండియా హెరాల్డ్ )

ఏపీలో జరిగిన సాధారణ ఎన్నికలలో వైసిపి చిత్తుచిత్తుగా ఓడిపోయింది. కేవలం 11 సీట్లకు పరిమితం అయింది. ఎన్నికలలో వైసిపి ఓడిపోయిన తర్వాత ఆ పార్టీ నుంచి పలువురు కీలక నేతలు వరుస పెట్టి బయటకు వెళ్ళిపోతున్నారు. చివరకు మాజీ మంత్రులు .. ఉప ముఖ్యమంత్రి .. మాజీ ఎమ్మెల్యేలు .. మాజీ ఎంపీలు .. జిల్లా పార్టీ అధ్యక్షులు మాత్రమే కాదు రాజ్యసభ సభ్యులుగా ఉన్నవారు పార్టీ మారిపోతున్నారు. ఇది నిజంగా వైసిపికి పెద్ద షాక్ అని చెప్పాలి. ఇది ఇలా ఉంటే ఉభయగోదావరి జిల్లాలలో కూడా వైసీపీలో ఉండేందుకు ఎవరు ఇష్టపడటం లేదు. మరీ ముఖ్యంగా రెండు ఉభ‌య గోదావరి జిల్లాలలో వైసీపీలో ఉన్న కాపు నేతలు అందరూ వరుస‌ పెట్టి పార్టీ మారెందుకు రెడీ అవుతున్నారు. ఇప్పటికే మాజీమంత్రి మాజీ ఉప ముఖ్యమంత్రిగా నిన్న మొన్నటి వరకు ఏలూరు జిల్లా పార్టీ అధ్యక్షుడుగా ఉన్న ఆళ్ల నాని పార్టీకి రాజీనామా చేసేశారు.


మరో మాజీ మంత్రి కురసాల కన్నబాబు సైతం పార్టీ మారే ఆలోచన చేస్తున్నట్టు తెలుస్తోంది. అలాగే బీసీ వర్గాలకు చెందిన మాజీ మంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ కుటుంబంతో పాటు మరికొందరికి నేతలు కూడా వైసీపీలో ఉండేందుకు ఎంత మాత్రం ఇష్టపడటం లేదని తెలుస్తోంది. మిగిలిన సామాజిక వర్గాల సంగతి ఎలా ఉన్నా కాపు నేతలు మాత్రం పార్టీ మారి జనసేన వైపు చూస్తున్నట్టు ఉభయగోదావరి జిల్లా రాజకీయ వర్గాలలో ఒక్కటే హాట్ టాపిక్ గా ప్రచారం జరుగుతుంది. గోదావరి జిల్లాలకు బయట ఉన్న కాపు నేతలు కూడా పార్టీ మారిపోతున్నారు. కృష్ణ - గుంటూరు జిల్లాలకు చెందిన కాపు నేతలు సామినేని ఉదయభాను - కిలారు వెంకట రోశ‌య్య ఇప్పటికే వైసీపీకి గుడ్ బై చెప్పిన సంగతి తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: