ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి మహర్దశ రానుంది. కేంద్రం పదివేల కోట్లను ప్రపంచ బ్యాంకు ద్వారా అందిస్తోంది. ఇందుకు నివేదిక అంతా రెడీ అయిపోయింది .. ప్రపంచ బ్యాంకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది .. నవంబర్ నాటికి కేంద్రం అడ్వాన్సులు ఇచ్చే అవకాశం ఉంది. అందుకే డిసెంబర్ నుంచి పూర్తిస్థాయిలో పనులు జరిగా ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటికే నివేదికలతో పాటు జంగిల్ క్లియరెన్స్ వంటి పనులు జోరుగా సాగుతున్నాయి. గతంలో చాలా పనులు మధ్యలో ఆగిపోయాయి .. వాటి సామర్థ్యాన్ని పరీక్షించి కట్టడాలను కొనసాగించడానికి అవసరమైన చర్యలపై ఇప్పటికే స్పష్టత వచ్చేసింది. ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే అమరావతి నిర్మాణం ప్రారంభించే అవకాశం ఉంది. కానీ నిధులు సమస్య ఉంది. అందుకే కేంద్రం ఇచ్చే నిధులతోనే అమరావతి నిర్మించాలని చంద్రబాబు నిర్ణయించారు. ఐదేళ్లపాటు అమరావతిని జగన్ ప్రభుత్వం పాడు పెట్టేసింది.
మొత్తం మళ్లీ నిర్మాణానికి అనుకూలంగా తీసుకురావాలి అంటే చాలా సమయం పడుతుంది. దానిని ఎలా ? సద్వినియోగం చేసుకున్నారు. గతంలో ఒప్పందం చేసుకున్న కాంట్రాక్టర్లతో గడువు ముగిసిపోయింది. చాలామంది బిల్లులు రావలసిన వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళందరికీ సెటిల్ చేసి ఇప్పుడు కొత్త టెండర్లను పిలవాల్సిన అవసరం ఉంది. అక్టోబర్ - నవంబర్ నెలలో ఈ టెండర్ల ప్రక్రియ పూర్తి చేసి డిసెంబర్ మొదటి వారంలో అమరావతి నిర్మాణం కంటిన్యూగా ప్రారంభం అయ్యేలా చంద్రబాబు ప్రణాళికలు రచిస్తున్నారు. బడా నిర్మాణ సంస్థలని ఏకకాలంలో రంగంలోకి దింపి ఒకేసారి పెద్ద ఎత్తున పనులు జరిగేలా చేయనున్నారు. అటు కేంద్ర ప్రభుత్వ భవనాలు .. ఇటు ఇతర ప్రైవేటు సంస్థలు పెట్టుబడుల ను ఒకేసారి వచ్చేలా చూస్తున్నారు. వచ్చే డిసెంబర్ నుంచి 24 గంటల పాటు అమరావతి పనులు వెలిగి పోయే అవకాశం ఉంది.