ఇలాగే రేవంత్ రెడ్డి వ్యవహరిస్తే కాంగ్రెస్ పార్టీకే నష్టం వాటిల్లుతుందని చాలామంది అధిష్టానానికి ఫిర్యాదు చేశారట. దీంతో మొన్న సోమవారం రాత్రి ఢిల్లీకి హుటా హుటన రేవంత్ రెడ్డి వెళ్లారు.ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి పై మొట్టికాయలు వేశారట రాహుల్ గాంధీ. తమకు, కాంగ్రెస్ మంత్రులకు... ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేకుండా ఇలా కూల్చివేతలు ఎందుకు చేస్తున్నావని కాంగ్రెస్ అధిష్టానం ఫైర్ అయిందట.
అయితే దీనిపై చాలా స్ట్రాంగ్ గా రిప్లై ఇచ్చారట సీఎం రేవంత్ రెడ్డి. వాళ్లకు చెప్పి చేయాల్నా ప్రతిదీ... అంటూ రెచ్చిపోయి మాట్లాడారట. అధిష్టానాన్ని లెక్కచేయకుండా... వ్యవహరించారట తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. దీంతో కాంగ్రెస్ అధిష్టానం చాలా షాక్ అయిందట. ఇలాంటి ముఖ్యమంత్రి తమకు అవసరం లేదని ఓ నిర్ణయానికి వచ్చిందట కాంగ్రెస్ అధిష్టానం. దేశవ్యాప్తంగా నాలుగు రాష్ట్రాల్లో ఎన్నికలు ఉన్న నేపథ్యంలో... ఇప్పుడే ముఖ్యమంత్రిని మార్చడం మంచిది కాదని భావిస్తోందట. ఎన్నికలు పూర్తికాగానే రేవంత్ రెడ్డి పదవిని తీసేయాలని అనుకుంటున్నారట. దీనిపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.