టిడిపి అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తీవ్ర సుడిగుండంలో చిక్కుకున్నారు. ఒకవైపు వరద నష్టాల నుంచి ఇంకా గెట్టెక్కకపోవడం, మరోవైపు తిరుమల శ్రీవారి లడ్డు ప్రసాదం వివాదం, ఇంకొక వైపు నామినేటెడ్ పదవుల్లో తమ్ముళ్ల అసంతృప్తులు.. ఇలా అనేక రకాలుగా అంతర్గత సమస్యలతో చంద్రబాబు సతమతమవుతున్నారు. వాస్తవానికి ఒక సమస్య వచ్చినప్పుడు దాన్ని పరిష్కరించుకునేం దుకు మార్గాలు వెతుక్కోవలసిన అవసరం ఉంటుంది.


ఉదాహరణకు విజయవాడ వరదలు వచ్చాయి. దాదాపు 6880 కోట్ల రూపాయల మేరకు నష్టం వాటిల్లిందని కేంద్ర ప్రభుత్వానికి ప్రాథమికంగా నివేదిక పంపించారు. ఇదే సమయంలో కూటమిలో ఉన్నాం కాబట్టి తమకు ఆశించిన మేరకు న్యాయం జరుగుతుందని కూడా చంద్రబాబు ఆశించారు. అయితే దీనికి భిన్నంగా కేంద్రంలోని మోడీ ప్రభుత్వం 1000 కోట్ల రూపాయలు ఇచ్చి చేతులు దులుపుకున్న పరిస్థితి కనిపించింది. తాజాగా ఒక వెయ్యి 1400 కోట్ల రూపాయలను రాష్ట్రానికి వరద సాయం కింద కేటాయించింది.


 కానీ జరిగిన నష్టం మాత్రం 6880 కోట్ల రూపాయలు పైగానే ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నా రు. ఇది చంద్రబాబుకు స‌మ‌స్య‌గా మారింది. కేంద్రంలో అధికారంలో ఉండి కూడా నిధులు తెప్పించు కోలేకపోవడం అనేది ఇప్పుడు ఆయనకు పెను సంకటంగా మారిన పరిస్థితి కనిపిస్తోంది. మరోవైపు తిరుమల శ్రీవారి లడ్డు ప్రసాదం విషయంలో చంద్రబాబు నాయుడు తొందరపడి ప్రకటనలు చేశారని సుప్రీంకోర్టు తీవ్రంగా ఆక్షేపించింది.


రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్నారంటూ పేర్కొని.. ఇలాంటి వ్యాఖ్యలు చేయొచ్చా అని నిలదీసింది. దీని నుంచి చంద్రబాబు ఏం చెప్పదలుచుకున్నారు అనేది ఇంకా స్పష్టంగా తెలియలేదు. ప్రస్తుతానికైతే మౌనంగా ఉన్నారు. మళ్ళీ ఈ కేసు పై విచారణ గురువారం జరగనుంది. అప్పుడు ఎలాంటి వ్యాఖ్యలు చేస్తుందో ఏమవుతుందో అన్నది చంద్రబాబుకు ఇబ్బందిగానే ఉంది. ఈ పరిణామాల క్రమంలోనే తిరుమల శ్రీవారి లడ్డుపై వేసిన సిట్ విచార‌ణ‌కు బ్రేక్ ఇచ్చారు. ఇక మరో కీలకమైనటువంటి అంశం నామినేటెడ్ పదవులు.


నామినేటెడ్ పెదవులను భర్తీ చేయాలని చంద్రబాబుకు ఉన్నప్పటికీ పోటీలో ఎక్కువ మంది ఉండడం ఒకరికి ఇచ్చి.. ఒకరికి ఇవ్వకపోతే ఇబ్బందులు రావడం ఆయనకు తలనొప్పిగా మారింది. ఇప్పటికే కొంతమంది తమకు ప్రాధాన్య‌ పదవులు ద‌క్క‌లేదంటూ అసంతృప్తి వ్యక్తం చేస్తూ అంతర్గతంగా లేఖలు పంపించారు. మరికొందరు మౌనంగా ఉన్నారు. ఈ క్రమంలో నామినేటెడ్ పదవులను భర్తీ చేయాలా వద్దా అనేది ఇప్పుడు చంద్రబాబుకు సంఘటనగా మారి ఈ బాధ్యతలను నేరుగా నారా లోకేష్ కు ఇచ్చారు.


అక్కడ కూడా నారా లోకేష్ కు తలనొప్పులు తప్పడం లేదు. ఆయన చుట్టూ కూడా సీనియర్లు జూనియర్లు సహా అనేకమంది పదవులు కోసం వ‌త్తిడి తెస్తున్నారు. ఈ పరిణామాలు ఇలా ఉంటే వరద నష్టం కొంతమందికే అంది సగానికి పైగా అందకపోవడంతో విజయవాడ, ఏలూరు, కాకినాడ సహా మరి కొన్ని ప్రాంతాల ప్రజలు ప్రభుత్వ తీరును ఎండగ‌డుతున్నారు. ఇదేం పద్ధతి అంటూ ప్రశ్నిస్తున్నారు. కనీసం తమకు సమాధానం చెప్పే వాళ్ళు కూడా కనిపించడం లేదని అంటున్నారు.


గతంలో వాలంటీర్ వ్యవస్థ ఉన్నప్పుడు తమకు కొంతైనా సమాచారం ఉండేదని ఇప్పుడు తాము కార్యాలయాలు చుట్టు తిరగలేక ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇది కొన్ని ప్రాంతాలకే పరిమితమైనా.. రాను రాను ప్రభుత్వం మొత్తానికి పాకే అవకాశం కనిపిస్తోంది. గడిచిన నెల రోజుల కాలంలో చంద్రబాబు ఇబ్బందులు పడ్డారని చెప్పాలి. మరి ఇది స్వయంగా చేసుకున్నదా లేక తాకతాళియంగా జరిగిందా అనేది కాలమే తేల్చాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: