తెలంగాణలో గత కొన్ని నెలలుగా రాజకీయాలు ఎంత దిగజారిపోయాయో ఈ ఉదంతం తెలియజేస్తోంది. నాయకులు ఒకరినొకరు దూషించుకుంటూ వ్యక్తిగత దూషణలకు పాల్పడుతున్నారు. సురేఖ మరో మహిళ ఇమేజ్ను ఒక ఫ్యామిలీని దెబ్బతీస్తున్నానని కూడా ఆలోచించకుండా కారణమైన అలిగేషన్స్ చేశారు. వైసీపీ హయాంలోనూ ఆంధ్రప్రదేశ్‌లో ఇదే పరిస్థితి నెలకొంది. చంద్రబాబు నాయుడు భార్య నారా భువనేశ్వరిపై వైసీపీ నేతలు అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. ఆ నేతలపై జగన్ మోహన్ రెడ్డి చర్యలు తీసుకోలేదు. కాలక్రమేణా, ఇది వైసీపీ ప్రభుత్వ పతనానికి దోహదపడింది.
సమంతపై సురేఖ ఈ వ్యాఖ్యలు చేయడం ద్వారా కాంగ్రెస్ ప్రతిష్టను దెబ్బతీసింది. ఆమె క్షమాపణలు చెప్పినా అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. సొంత పార్టీకే ఆమె గోతులు తీసినట్లు అయ్యింది. ఆమె రాజకీయ ప్రత్యర్థి కేటీఆర్‌ను విమర్శించడమే కాకుండా సినీ పరిశ్రమ ఈ రొంపిలోకి లాగారు. అది ఏ మాత్రం అంగీకరించదగిన విషయం కాదు. అంతేకాకుండా, ఒక మహిళ నుంచి వ్యాఖ్యలు వచ్చినందున, అది మరింత హాని కలిగించింది.
ఇప్పుడు ఈ సమస్యను పరిష్కరించాల్సిన బాధ్యత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై ఉంది. ఈ పరిస్థితిని ఎలా ఎదుర్కోవాలో అందరూ చూస్తున్నారు. కాంగ్రెస్ ప్రతిష్టను కాపాడేందుకు ఆయన స్పందించడం ముఖ్యం. వైఎస్ జగన్ లాగా రేవంత్ మౌనంగా ఉంటే ప్రజల్లోకి నెగిటివ్ మెసేజ్ వస్తుంది. ఈ తరహా ప్రవర్తనను రేవంత్ సమర్ధిస్తాడని జనాలు అనుకోవచ్చు. ఇది కాంగ్రెస్ ప్రతిష్టను మరింత దెబ్బతీయవచ్చు.