ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసిపి పార్టీ ఓడిపోయిన తర్వాత అత్యంత దారుణమైన పరిస్థితులను వైయస్ జగన్మోహన్ రెడ్డి ఎదుర్కొనడం జరుగుతుంది. మొన్నటి ఎన్నికల్లో 11 సీట్లు రావడం పై... వైసీపీలో చాలా వరకు అసంతృప్తి నెలకొంది. అసలు ఎందువల్ల వైసిపి ఇంత దారుణంగా ఓడిపోయిందనే దానిపైన ఎవరి దగ్గర ఆన్సర్ లేదు. అందరూ తలలు పట్టుకుంటున్నారు. ఇక ఓపిక లేని వారు పార్టీ మారిపోతున్నారు.


ఇప్పటికే చాలామంది వైసిపి నేతలు పార్టీని వీడి జనసేనలోకి వెళ్లారు. జగన్మోహన్ రెడ్డి కుటుంబ సభ్యులు బాలినేని  శ్రీనివాస్ రెడ్డి లాంటి నేతలే... వైసీపీని వీడడం దారుణం.అయితే కీలక నేతలు జారకుంటున్న నేపథ్యంలో... వైయస్ జగన్మోహన్ రెడ్డి ముందు... వైసీపీ కార్యకర్తలు అలాగే కీలక నేతలు ఒక డిమాండ్ పెట్టారట. వైసిపి సలహాదారులు సజ్జల రామకృష్ణారెడ్డిని.. తప్పించాలని ఒకే పట్టు పట్టారట వైసీపీ నేతలు.


ఈ డిమాండ్ ను మొన్న ఎన్నికల్లో ఓడిపోయినప్పటి నుంచి..  జగన్ ముందు పెడుతున్నారట. అయినప్పటికీ వైసీపీ  పార్టీ అధినేత.. వైయస్ జగన్మోహన్ రెడ్డి... ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. కానీ తాజా సమావేశంలో మాత్రం జగన్ దీనిపైన దృష్టి పెట్టినట్లు వార్తలు వస్తున్నాయి. వైసీపీ సోషల్ మీడియాలో కూడా ఇదే వార్త చెక్కర్లు కొడుతోంది. దీంతో ఈసారి కచ్చితంగా సజ్జల రామకృష్ణా రెడ్డి పైన వేటు పడక తప్పదని చెబుతున్నారు.


ఆయన సలహాదారులుగా ఉండి... వైసిపి పార్టీకి ఎలాంటి ప్రయోజనం లేదని నేతలందరూ ఒకే తాటిపైన నిలబడి చెప్పారట. దీంతో జగన్ కూడా... వారి నిర్ణయానికి ఓకే చెప్పినట్లు సమాచారం. మరో నాలుగు ఐదు రోజుల్లోనే సజ్జల రామకృష్ణారెడ్డి పైన వేటు పడే ఛాన్స్ ఉందని సమాచారం. దీంతో సజ్జల స్థానంలో ఓ ప్రముఖ పాత్రికేయుడ్ని.. సలహాదారుగా పెట్టుకోవాలని అనుకుంటున్నారట. దీనిపై అధికారిక ప్రకటన కూడా త్వరలోనే రాబోతున్నట్లు వార్తలు... వస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: