మరోవైపు నాగార్జున ఇప్పటికే పరువు నష్టం దావా దాఖలు చేసిన నేపథ్యంలో కొండా సురేఖ బహిరంగ క్షమాపణలు చెబితే మాత్రమే ఈ పరిస్థితులు మారే అవకాశాలు ఉంటాయి. నాగార్జున తన పరువుకు భంగం కలిగించేలా సురేఖ కామెంట్లు చేసిన నేపథ్యంలో ఈ ఇష్యూను ఒకింత సీరియస్ గానే తీసుకున్నారని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. నాగ్ ఈ విషయంలో వెనక్కు తగ్గే అవకాశాలు కూడా లేవు.
ఇండస్ట్రీ నుంచి కూడా నాగార్జునకు పూర్తిస్థాయిలో మద్దతు లభించడం ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా హాట్ టాపిక్ అవుతోంది. నాగార్జున వరుస వివాదాల నేపథ్యంలో సైలెంట్ గా ఉంటే తప్పును అంగీకరించినట్టు అవుతుందని భావించినట్టు తెలుస్తోంది. సమంత సైతం ఈ వివాదం విషయంలో కోర్టును ఆశ్రయిస్తారేమో చూడాల్సి ఉంది. నాగార్జున కెరీర్ పై కూడా వివాదాలు ఒకింత ప్రభావం చూపుతున్నాయి.
నాగార్జున భవిష్యత్తులో సైతం తమ ఫ్యామిలీ గురించి తప్పుగా ప్రచారం చేసే వాళ్ల విషయంలో ఇంతే ఘాటుగా రియాక్ట్ కావాల్సిన అవసరం అయితే ఉందని చెప్పవచ్చు. నాగార్జున కుబేర, కూలీ సినిమాలతో బిజీగా ఉండగా ఈ రెండు సినిమాలపై మంచి అంచనాలు నెలకొన్నాయి. నాగ్ ఫ్యామిలీకే ఎందుకిలా జరుగుతోందంటూ నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. నాగార్జునను ఎవరైనా కావాలని టార్గెట్ చేస్తున్నారా అనే ప్రశ్నలు సైతం వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. నాగ్ తన టాలెంట్ తో అంతకంతకూ ఎదుగుతూ ఎంతోమందికి ఇన్స్పిరేషన్ గా నిలుస్తున్నారు.