- రాజకీయాల్లోకి హీరోయిన్స్ ను లాగుతున్న వైనం..
- కొండా సురేఖ మాటల్లో నిజమేంతా?
తాజాగా సోషల్ మీడియాలో మెయిన్ మీడియాలో ఎక్కడ చూసినా కొండా సురేఖ చేసినటువంటి కామెంట్స్ గురించే వినిపిస్తోంది. ఆమె చేసిన కామెంట్స్ పై ఓవైపు రాజకీయ వర్గాల్లోనే కాకుండా సినీ ఇండస్ట్రీలో కూడా తీవ్రమైన చర్చ సాగుతోంది. ఆమె తెలిసి చేసిందా తెలియక చేసిందా లేదంటే స్క్రిప్ట్ ప్రకారమే ఈ కామెంట్స్ చేసిందో తెలియదు కానీ దానికి ఆమె మాట్లాడిన మాటలు తీవ్రమైన వివాదానికి దారితీసాయి. సినీ ఇండస్ట్రీలోని వ్యక్తుల కుటుంబ వ్యవహారాల గురించి ఆమె రాజకీయాల్లోకి తీసుకువచ్చి మాట్లాడడం మరింత దారుణమైన విషయం. మరి కొండా సురేఖ స్క్రిప్ట్ ప్రకారమే ఇలా చేస్తుందా.. లేదంటే ఆమె చేసిన మాటల్లో నిజం ఉందా.. నిజం ఉంటే మళ్లీ క్షమాపణలు ఎందుకు కోరింది.. ఆ వివరాలు ఏంటో చూద్దాం..
కొండా సురేఖ మాటల్లో నిజమెంతా?
మంత్రి కొండా సురేఖ ఒక బాధ్యతాయుతమైనటువంటి పదవిలో ఉంది. అలాంటి ఆమె బాధ్యత రహితమైనటువంటి మాటలు నిరాధారమైనటువంటి మాటలు మాట్లాడడం చాలా దారుణమని ఎంతోమంది సినీ ప్రముఖులు విమర్శిస్తున్నారు. అయితే కొండా సురేఖ నాగార్జున మాజీ కోడలు సమంతా పై దారుణమైన కామెంట్స్ చేసింది. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నాగార్జున ఎన్ కన్వెన్షన్ సెంటర్ కు సంబంధించి కూల్చివేత పై నోటీసులు పంపారట. అయితే ఈ కూల్చివేతను ఆపాలి అంటే కేటీఆర్ దగ్గరికి సమంతాను పంపాలని నాగార్జునకు రాయబారం పంపారట. దీంతో నాగార్జున నాగచైతన్య కలిసి సమంతాను కేటీఆర్ దగ్గరికి పంపడానికి ఒప్పుకున్నట్టు, ఈ విషయం సమంతా కి చెబితే ఆమె నిరాకరించి వారితో గొడవ పడిందని దీనివల్లే నాగచైతన్యకు సమంతకు విడాకులు అయ్యాయని మంత్రి కొండా సురేఖ కామెంట్లు చేసింది. అంతేకాకుండా చాలామంది ప్రముఖుల హీరోయిన్ల ఫోన్లు ట్యాప్ చేసి కేటీఆర్ లైంగికంగా వేధించారని కూడా మాటలు మాట్లాడింది.