ప్రస్తుతం ఉన్న ఆంధ్రప్రదేశ్  పరిస్థితిని చూసి ఏపీ సీఎం చంద్రబాబు తాను తీసుకున్న గొయ్యిలో తానే రాజకీయ నాయకుడిగా దిగిపోయాడనే వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ మాట ఎవరో కాదు టిడిపి పార్టీకి చాలా విశ్వసనీయ వ్యక్తిగా ఉన్నటువంటి అధినేత ఈ మాట అన్నారట.. ఎన్నికల ముందు సూపర్ సిక్స్ హామీలు ఇచ్చి ఇప్పుడు సర్వత్ర చర్చనీయాంశంగా మారుతున్నది. వందరోజుల పాలన వరకు ఎలాగోలాగా ఈ విషయాలను నెట్టుకొచ్చారు కానీ.. ఇప్పుడు పరిస్థితులు ఒకసారిగా చేజారుతున్నాయట. ముఖ్యంగా గత వైసిపి పాలన అప్పులు చేశాయని చెప్పుకొస్తున్నప్పటికీ కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయిందట.



ముఖ్యంగా ఎమ్మెల్యేలు ఎక్కడికి వెళ్లినా సరే ప్రజలు సూపర్ సిక్స్ హామీల గురించి ఎక్కువగా ప్రశ్నిస్తూ ఉండడంతో చాలామంది ఎమ్మెల్యేలు ప్రజల మధ్యకు రావడానికి మక్కువ చూపడం లేదట. అంతేకాకుండా ఇటీవల సీఎం చంద్రబాబుని డైరెక్ట్ గా ఒక మహిళ పార్టీ కార్యాలయంలో తన బాబుకు తల్లికి వందనం ఎప్పుడు ఇస్తారు అంటూ ప్రశ్నించింది.. ఆ తర్వాత రోజున చంద్రబాబు సూపర్ సిక్స్ హామీలను ఎట్టి పరిస్థితులలో ఉన్న అమలు చేస్తామని చెప్పారు. కానీ వీటి పైన ఇప్పటివరకు ఏం చేస్తున్నామని విషయాన్ని మాత్రం చెప్పలేదు.


దీంతో అటు ఎమ్మెల్యేలు కూటమి ప్రభుత్వం పైన కూడా ఎన్నికల హామీల పై ఒత్తిళ్లు  పెరుగుతున్నాయి. ప్రజల మధ్య కూడా ఇవే ఎక్కువగా ఇప్పుడు చర్చనియంశంగా మారుతున్నాయట. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా ఈ పథకాలను అమలు చేసి తీరుతామంటూ నిన్నటి రోజున వారాహి సభలో  వెల్లడించారు. దీంతో సాధారణంగా ప్రజల నాడి ఎలా ఉందనే విషయం ఇప్పుడు కూటమి ప్రభుత్వానికి పూర్తిగా తెలిసిపోయింది.. ఈ సంక్షేమ పథకాల విషయంలో ఎన్ని మాటలు చెప్పినా తప్పించుకోలేని పరిస్థితి కూటమి ప్రభుత్వానికి సైతం ఇప్పుడు ఏర్పడిందట. గత ప్రభుత్వం ఇచ్చిన హామీలను తాను అన్నిటిని కంటిన్యూ చేస్తానని పేరును మార్చి అంతకంటే ఎక్కువగా ఇస్తామని చెప్పిన ఇప్పుడు కనీసం ఒక్క పథకాన్ని కూడా అమలు చేయడం లేదనే విధంగా కూటమి సర్కార్ పైన పెదవి విరుస్తున్నారు ప్రజలు. మరి ఇప్పటికైనా ఏపీ సీఎం మేల్కొని వీటి సంగతి చూస్తారేమో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: