అయితే సుప్రీం కోర్టు కామెంట్లతో పరిస్థితి మారింది. సుప్రీం కోర్టు తాజాగా స్వతంత్ర సిట్ ఏర్పాటు దిశగా అడుగులు వేయడంతో పరిస్థితులు తమకు అనుకూలంగా తీర్పు వస్తుందని వైసీపీ భావిస్తోంది. ఆరోపణలు చేస్తే కోర్టుకు వెళ్లాలని జగన్ భావిస్తున్నారని పొలిటికల్ వర్గాల భోగట్టా. జగన్ ప్రస్తుతం సైలెంట్ గా ఉన్నా తెలివిగానే వ్యూహాలతో అడుగులు వేస్తున్నారని సమాచారం అందుతోంది.
వైసీపీకి వచ్చే నాలుగున్నర సంవత్సరాలు కోర్టులే ఒక విధంగా శ్రీరామరక్ష అని కామెంట్లు వినిపిస్తున్నాయి. ఏపీలో వైసీపీకి కేవలం 11 స్థానాల్లో మాత్రమే విజయం దక్కింది. వైసీపీ పరిస్థితి రోజురోజుకు ఘోరంగా తయారవుతోంది. ప్రస్తుత పరిస్థితుల్లో పార్టీ పుంజుకోవాలంటే మాత్రం సులువు కాదని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. పార్టీ పుంజుకోవడానికి జగన్ ఏం చేస్తారో చూడాల్సి ఉంది.
2029లో వైసీపీ కచ్చితంగా అధికారంలోకి వస్తుందని జగన్ భావిస్తున్నట్టు తెలుస్తోంది. కూటమి పాలనలో పథకాల అమలు సరిగ్గా జరగకపోవడం వైసీపీకి మేలు చేస్తుందని జగన్ ఫీలవుతున్నారని భోగట్టా. జగన్ తనపై ఉన్న కేసుల విషయంలో ఏం చేస్తారో చూడాల్సి ఉంది. జగన్ వైసీపీకి పూర్వ వైభవం తీసుకొని రావడం కోసం కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోనున్నారని తెలుస్తోంది. జగన్ కు ప్రస్తుతం సోషల్ మీడియా నుంచి కూడా పూర్తిస్థాయిలో సపోర్ట్ అయితే లభించడం లేదని చెప్పవచ్చు. జగన్ భవిష్యత్తులో ఏపీలో జరిగే ఇతర ఎన్నికల్లో ఏ స్థాయిలో సత్తా చాటుతారనే చర్చ సైతం సోషల్ మీడియాలో జరుగుతోంది.