ముఖ్యంగా కుక్కలకు ఉన్న విశ్వాసం రైతులకు లేదంటూ ఆయన చేసిన వాక్యాలు సంచలనంగా మారుతున్నాయి.. రైతుల కోసం తాను ఎంతో కష్టపడ్డానని వారు తనకు మద్దతుగా నిలవట్లేదు అంటూ ఆయన వాపోతున్నారు.. తన సొంత డబ్బుతో కోట్ల రూపాయలను వారి యొక్క వ్యక్తిగత అవసరాలకు ఖర్చు చేశానంటూ తెలిపారు కూలికపూడి శ్రీనివాసరావు. సాగు నీటి కాలువలకు సంబంధించి లక్షలాది రూపాయలు ఖర్చు చేశానని తెలిపారు ఎమ్మెల్యే. అయితే ఈ ఎమ్మెల్యే అన్న వ్యాఖ్యలకు వ్యతిరేకంగా రైతులు, రైతు సంఘాలు కూడా ధర్నా చేసేందుకు సిద్ధమవుతున్నారట.
తిరుపూర్ నుంచి టిడిపి ఎమ్మెల్యేగా గెలిచిన ఈయన.. గెలవడంతోనే ఒక వ్యక్తి ఇంటిని జెసిబిలతో కూల్చడానికి కూడా ప్రయత్నించారు. అలాగే టిడిపికి చెందిన ఒక సర్పంచ్ను కూడా చాలా బహిరంగంగా దూషించడంతో ఆ సర్పంచ్ భార్య ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించింది. ఈ విషయాన్ని ఏపీ సీఎం చంద్రబాబు వరకు తీసుకువెళ్లారు అంతేకాకుండా మీడియా వరకు కూడా వెళ్లడంతో మీడియాను కూడా ఇష్టానుసారంగా మాట్లాడారు కొలికపూడి శ్రీనివాసరావు. ఈయన మాటలకు అడ్డుకట్టు వేయకపోతే కచ్చితంగా కూటమి ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందని పలువురు నేతలతో పాటు ప్రజలు కూడా తెలుపుతున్నారు. ఎన్నికల ముందు అమరావతి ఉద్యమ నేతగా పేరు సంపాదించిన ఈయన పలు రకాల టీవీ చానల్స్ లో కూడా కనిపిస్తూ చివరికి స్థానికుడు కాకపోయినా తిరుపూర్ నియోజవర్గం నుంచి పోటీ చేసి గెలిచారు.