తల, తోక లేని కథనం ఈ సినిమాకు మైనస్ అయ్యాయి. అప్పట్లోనే నిర్మాతకు ఈ సినిమాకు 12 కోట్ల రూపాయలకు పైగా నష్టాలు వచ్చాయి. ఈ సినిమాలో పవన్ లుక్ కు మంచి మార్కులు పడినా పవన్ కోసం రాసిన డైలాగ్స్ విషయంలో సైతం తీవ్ర స్థాయిలో విమర్శలు వచ్చాయనే సంగతి తెలిసిందే. నికిషా పటేల్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటించగా ఆమె పర్ఫామెన్స్ సైతం మూవీకి మైనస్ అయింది.
ఖలేజా, కొమరం పులి సినిమాలు మిగిల్చిన నష్టాల వల్ల తర్వాత కాలంలో శింగనమల రమేష్ బాబు నిర్మాణ రంగానికి దూరంగా ఉంటూ వచ్చారు. కొమరం పులి సినిమా ఫ్లాప్ కావడంతో తర్వాత రోజుల్లో పవన్, ఎస్జే సూర్య కాంబినేషన్ లో సైతం సినిమాలు రాలేదనే చెప్పాలి. పవన్ ప్రస్తుతం పొలిటికల్ కార్యక్రమాలతో బిజీగా ఉండటంతో ఆయన సినిమాల షూటింగ్స్ ఆలస్యమవుతున్నాయి.
పవన్ ప్రజా సేవకే పరిమితం కావడంతో పవన్ కొత్త సినిమాలకు సంబంధించిన ప్రకటనలు రావడం అయితే సులువు కాదని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. పవన్ సినిమాలు రిలీజ్ డేట్లను తరచూ మార్చుకుంటున్నాయి. వచ్చే ఏడాది అయినా పవన్ సినిమాలు థియేటర్లలో విడుదలవుతాయేమో చూడాల్సి ఉంది. యూత్ లో మాత్రం పవన్ కళ్యాణ్ క్రేజ్ ఊహించని స్థాయిలో పెరుగుతోంది. పవన్ కెరీర్ ను జాగ్రత్తగా ప్లాన్ చేసుకోవాల్సి ఉంది.