ఆ రెడ్ బుక్ లో ఉన్న వ్యక్తులపైనే కూటమి టార్గెట్ చేసి మరి కేసులు పెడుతోంది. అవసరమైతే దాడులు కూడా చేస్తున్నారు కొంత మంది తెలుగు తమ్ముళ్లు. అయితే ఇలాంటి నేపథ్యంలో... రెడ్ బుక్ ను మించి పోయేలా గ్రీన్ బుక్ తీసుకొస్తున్నట్లు... వైసిపి ప్రకటించింది. కూటమి ప్రభుత్వంలో వైసిపి నేతలను ఇబ్బందులు పెడుతున్న... వారి అంతు చూసేందుకు... ఈ గ్రీన్ బుక్ తీసుకు వస్తున్నట్లు తాజాగా అంబటి రాంబాబు ప్రకటన చేశారు.
ఈ ఐదు సంవత్సరాలు చంద్రబాబు ప్రభుత్వం ఏది చేసినా కచ్చితంగా ఇందులో రాస్తామని... మేము అధికారంలోకి వచ్చిన తర్వాత... కూటమి నేతల తాటతీస్తామని హెచ్చరించారు.అలాగే... వైసిపి కోసం ఇప్పుడు కష్టపడుతున్న కార్యకర్తల పేర్లు రాసుకుంటామని... అధికారంలోకి వచ్చిన తర్వాత వారికి మేలు చేస్తామని కూడా ప్రకటించారు అంబటి రాంబాబు.
నేను వైసిపి కార్యకర్తల పనితనాన్ని గ్రీన్ బుక్ లో రాసుకుంటానని... వైసిపి అధికారంలోకి వచ్చాక వారిని ఆదుకుంటామని తెలిపారు. టిడిపి కూటమి ఇచ్చిన హామీలు నెరవేర్చడం లేదు...డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని ఆగ్రహించారు అంబటి రాంబాబు. వరదల్లో పడవల రాజకీయం చేసిన ప్రభుత్వం ఇది..పడవలు పెట్టి బ్యారేజి పగల కొట్టే కుట్ర జరిగందని దుష్ప్రచారం చేస్తున్నారని ఆగ్రహించారు. కలియుగ ప్రత్యక్ష దైవం ను అడ్డు పెట్టుకుని రాజకీయాలు చేస్తున్నారని నిప్పులు చెరిగారు.