‘దేవుడిని రాజకీయాల నుంచి తప్పించాలి’ అని సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలను మీరు ఎలా చూస్తున్నారు? అని అడగగా.. పవన్ కళ్యాణ్ సమాధానం ఇస్తూ., తిరుమల అంశం రాజకీయాలకు సంబంధం లేదని.. ఇది కేవలం వెంకటేశ్వర స్వామి పై విశ్వాసం ఉంచి హిందువుల మనోభావాలను దెబ్బతీయకుండా ఉండడానికి మాత్రమే.. శ్రీవారి ఆలయ పవిత్రతను కాపాడడంతో పాటు శతాబ్దాలుగా పాటిస్తున్న సాంప్రదాయాన్ని పాటించడమే అని చెప్పుకోచ్చారు.
అలాగే మీరు సనాతన ధర్మ రక్షణ బోర్డు అవసరం గురించి మాట్లాడారు. ఆ బోర్డుకు వక్ఫ్ బోర్డు వంటి చట్టబద్ధమైన మరియు న్యాయపరమైన అధికారాలు ఉండబోతున్నాయా..? అని ప్రశ్నించగా... అందుకు సమాధానంగా నా దృష్టిలో బోర్డుకు మానవ హక్కుల కమిషన్ తరహాలో పాక్షిక న్యాయపరమైన హక్కులు ఉండాలని, త్రిపునల్లు కలిగి ఉన్న బోర్డు ఉండాలని , దేవాలయాలు భూములు ఆచార వ్యవహారాలలో పాటు చుట్టూ ఉన్న వ్యవస్థలను రక్షించడమే పనిగా చేయాలని ఆయన తెలిపారు. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరగకుండా ఉండేందుకు సరైన పద్ధతిని కలిగి ఉండాలని అని తెలిపారు.
ఈ క్రమంలో మీరు ఆంధ్రప్రదేశ్ బాలాసాహెబ్ ఠాక్రేనా అని అడగగా.. పవన్ కళ్యాణ్ లేదు నేను అలా కాదు. నేను నిజమైన లౌకికవాదానిని. అంటే అన్ని మతాల మతపరమైన ఆచారాలను రక్షించడంలో, గౌరవించడంలో రాజకీయ పార్టీలు పౌర సమాజానికి సమాన బాధ్యత ఉంటుంది అంటూ తెలిపారు. మతపరమైన మనోభావాలను దెబ్బతీయకుండా నిరోధించడానికి దిద్దుబాటు చర్యలు తీసుకోవాలని నా దృష్టిలో ఇదే నిజమైన సైక్యులరిజం అని తెలిపారు. ఇందులో భాగంగానే.. వారాహి డిక్లరేషన్ ఫలితం ఏమిటని ప్రశ్నించగా.. పవన్ కళ్యాణ్ సమాధానం ఇస్తూ సనాతర ధర్మాన్ని బలోపతం చేయడానికి చట్టాన్ని తీసుకురావడం, మతవిశ్వాసాలకు హాని కలిగించకుండా చర్యలు తీసుకోవాలని, ఈ తరహా చట్టాన్ని రాష్ట్ర స్థాయిలో జాతీయ స్థాయిలో అన్ని చోట్ల ఒకే విధంగా అమలు చేయాలని పవన్ కళ్యాణ్ తెలిపారు.