ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత నామినేట్ పదవుల విషయంలో ఎంతో చర్చ జరిగింది. ఈ క్రమంలోనే తాజాగా చంద్రబాబు 20 మందికి పైగా నామినేట్ పదోలను ఖరారు చేస్తూ  జాబితాను విడుదల చేశారు. అయితే వీటిలో అత్యంత కీలకమైన తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ పదవి మాత్రం పెండింగ్లో ఉంచారు. గత వైసిపి గవర్నమెంట్‌లో వైయస్ జగన్ చిన్నాన వైవి సుబ్బారెడ్డి టీటీడీ చైర్మన్గా వ్యవహరించారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో టిటిడి చైర్మన్ పదవి రేసిలో చాలా పేర్లు వినిపిస్తున్నాయి. తాజాగా ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరరావు పేరు కూడా టీటీడీ చైర్మన్ రేస్ లో వినిపించింది. ఇలా రోజుకొక పేరు వినిపిస్తున్న క్రమంలో కూటమి ప్రభుత్వం ఎవరిని ప్రకటిస్తుందనేది చూడాలి.


ఈ క్రమంలో టిటిడి పదవుల్లో తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన ఎవరో ఒకరు నియమితులవ్వడం ఎప్పటినుంచో వస్తుంది. 2014లో అప్పటి తెలుగుదేశం ప్రభుత్వ సమయంలో ప్రముఖ దర్శకుడు రాఘవేంద్రరావు svbc ఛానల్ కు చైర్మన్ గా వ్యవహరించారు. ఆ తర్వాత వచ్చిన వైసీపీ గవర్నమెంట్ లో టాలీవుడ్‌కు చెందిన ప్రముఖ హాస్య నటుడు 30 ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వి ఆ పదవి పొందారు. కానీ అనుకోని వివాదం కారణంగా ఆయన మధ్యలోనే ఆ పదవి నుంచి తొలగించారు. ఇక అదే సమయంలో టాప్ సింగర్ మంగ్లీ కూడా టీటీడీ బోర్డు మెంబర్గా నియమించింది అప్పటి ప్రభుత్వం.


కాగా ఇప్పుడు మళ్లీ కూటమి ప్రభుత్వంలో టిటిడి కి చెందిన పదవుల్లో టాలీవుడ్ నుండి ఎవరికి అవకాశం వస్తుందో అన్న చర్చ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఇప్పటికే టిడిపి తరఫున సీనియర్ నిర్మాత అశ్వినీ దత్, దర్శకుడు రాఘవేంద్రరావు, నటుడు మురళీమోహన్ ఈ బోర్డ్ మెంబర్ పదవి రేసులో ఉన్నారు. ఇక జనసేన నుండి కూడా గట్టిగానే ఉంది పోటీ.. ముఖ్యంగా పవన్ కు ఎంతో ఆప్తులైన స్టార్‌ దర్శకుడు త్రివిక్రమ్‌ శ్రీనివాస్ పేరు కూడా ఈ రేసులో ఉంది. అలాగే పవన్ స్నేహితుడు ఆర్ డైరెక్టర్ ఆనంద్‌ సాయి పేరుతో పాటు నాగబాబు పేరు కూడా పరిశీలనలో ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. ఇక ముఖ్యమంత్రి చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఈ పదవి విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

TTD