ఇలాంటి కీలక సభకు తెలుగుదేశం పార్టీ గైర్హాజరు వెనుక భయమే కారణమా అన్న సందేహం కలుగుతుంది. పవన్ కళ్యాణ్ నూతన పంథా.. ముస్లిం, క్రిస్టియన్ మైనార్టీలతో పాటు దళితులని వర్గాలని దూరం చేస్తుందని టిడిపి నేతలు భయపడుతున్నట్లు తెలుస్తోంది. అందుకే పవన్ సభకు తెలుగుదేశం పార్టీ దూరంగా ఉందా అన్న ప్రచారం కూడా నడుస్తోంది. టిడిపితో ఏమాత్రం సంబంధం లేకుండా పవన్ కళ్యాణ్ తన సొంత ఎజెండాతో ముందుకు వెళుతున్నారని తెలుగుదేశం పార్టీ నేతల సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. బిజెపి హిందుత్వ ఏజెండాతో పవన్‌తో ముందుకు వెళుతున్నారని టిడిపి నేతలు చెబుతున్నారు. రాజకీయాల్లో పవన ప్రమాదకరమైన గేమ్ ఎంచుకున్నారు అన్న చర్చ కూడా ఇప్పుడు తెరమీదకు వచ్చింది.
అన్నట్టు ఇప్పటికిప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో సనాతన ధర్మానికి వచ్చిన ప్రమాదం ఏంటని ప్రశంన ఉత్పన్నమవుతుంది. అపరమితమైన అధికారాన్ని దక్కించుకొని చక్కగా పాలన చేయకుండా.. పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఈ తరహ రాజకీయాలకు ఎందుకు తెర లేపారో అర్థం కావడం లేదని తెలుగుదేశం వాళ్ళు తలలు పట్టుకుంటున్నారు. ఉప ముఖ్యమంత్రిగా కీలకమైన బాధ్యతలని చేతిలో పెట్టుకుని తనకు ఇచ్చిన హామీల అమలకు కృషి చేయకుండా.. సనాతన పరిరక్షణ అంటూ పవన్ కళ్యాణ్ బహిరంగ సభ నిర్వహించడం ఏంటో అన్న నిట్టూర్పులు తెలుగుదేశం పార్టీలో వినిపిస్తున్నాయి. ఏది ఏమైనా పవన్ కళ్యాణ్ దూకుడు, సొంత ఎజెండాతో ముందుకు వెళ్లడం తెలుగుదేశం పార్టీలో గుబులు అయితే రేపుతోంద అన్నది వాస్తవం.