హైడ్రా పేరుతో రేవంత్ రెడ్డి సర్కారు.. అక్రమంగా కట్టిన నిర్మాణాలను చాలా నిర్దాక్షిణ్యంగా కూల్చివేస్తూ ముందుకు సాగుతుంది. దీనిపై ఎన్ని విమర్శలు వచ్చినా రేవంత్ రెడ్డి ఎంత మాత్రం వెనక్కు తగ్గటం లేదు. కూల్చివేతల‌కు గురవుతున్న భవనాలను కోల్పోతున్న వారికి తప్ప.. రేవంత్ హైడ్రా కాంబినేషన్‌లో జరుగుతున్న కూల్చివేతలకు సర్వత్రా ప్రజా మోదం వ్యక్తం అవుతుంది. అలా నష్టపోతున్న వారిలో కూడా కొంత సానుభూతి ఉంది. చెరువులను, నిధులను ఆక్రమించి ఫామ్ హౌస్ లు, కన్వెన్షన్ సెంటర్లు కట్టుకున్న సంపన్నులు సహజంగానే కోపంతో ఉంటారు. అదే సమయంలో మూసీ నది తీరం ప్రాంతంలో ఇల్లు కోల్పోయిన పేదల్లో అదే స్థాయి వ్యతిరేకత లేదు. వారందరికీ డబుల్ బెడ్ రూమ్ ఇల్లు కేటాయించిన తర్వాతే కూల్చి వేతలు చేపడుతూ ప్రజాగ్రహం రాకుండా రేవంత్ సర్కారు చాలా జాగ్రత్తగా పడుతోంది.


ఇలాంటి నేపథ్యంలో రేవంత్ రెడ్డి సర్కారు చేపడుతున్న ఈ యజ్ఞానికి నైతిక బలం అందించేలా కెవిపి రామచంద్రరావు ఓ ఆసక్తికర పని చేశారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి అత్యంత సన్నిహితుడు అయిన కేవీపీ.. మూసీ నది తీరంలో ఓ ఫామ్ హౌస్ కట్టుకున్నారు. దీంతో సహజంగానే బిఆర్ఎస్ నేతలు కెవిపి ఫామ్ హౌస్ కూడా రేవంత్ కూల్చివేయాలని డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలోని కేవీపీ స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్‌కు ఒక లేఖ రాశారు. కూల్చివేతల విషయంలో తన పట్ల ఎలాంటి మినహాయింపులు అక్కర్లేదని.. సాధారణ పౌరుడు విషయంలో చట్టం ఎలా ఉందో తన పట్ల కూడా అలాగే వ్యవహరించాలని కోరారు.


తన ఫామ్ హౌస్ ను చట్ట ప్రకారమే నిర్మించాను అని.. అక్రమ నిర్మాణం అని తెలిస్తే తానే తన సొంత ఖర్చుతో కూల్చివేస్తానని కెవిపి రామచంద్రరావు ముందుకు రావడం విశేషం. మూసీ నది బఫర్ జోన్ విషయంలో రేవంత్ ప్రభుత్వం చాలా దూకుడుగా నిర్మొహమాటంగా వ్యవహరిస్తోంది. సంపన్నుల ఆస్తులు, కన్వెన్షన్ సెంటర్లు కూల్చినప్పుడు మద్దతు ప్రకటించిన బిజేపి కూడా.. మూసి ప్రాంతంలో పేదల ఇల్లు కూల్చివేస్తుంటే వ్యతిరేకిస్తోంది. వారికి డబుల్ బెడ్ రూమ్ ఇల్లు కేటాయించిన విషయాన్ని బిజేపి మర్చిపోతుంది. ఏది ఏమైనా రేవంత్ ప్రయత్నానికి నైతిక మద్దతు ఇచ్చేలా కాంగ్రెస్ సీనియర్ నాయకుడు ఆయన కెవిపి రామచంద్రరావు తన ఇల్లు అక్రమం అని తేలితే తానే స్వయంగా కూల్చివేస్తానని చెప్పటం రేవంత్ కూల్చివేతలకు మంచి నైతిక మద్దతు ఇచ్చినట్లయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: