గత నాలుగైదు రోజుల నుంచి తెలంగాణ మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు  సమంత ,అక్కినేని కుటుంబం ,కేటీఆర్ పైన చేసిన వ్యాఖ్యల దుమారం రోజురోజుకే పెరుగుతూనే ఉంది. ఈ విషయం పైన అటు అక్కినేని కుటుంబ సభ్యులు కూడా ఈ మంత్రిపైనా ఫైర్ అయ్యారు. అంతేకాకుండా ఆమె పైన 100 కోట్లు పరువు నష్ట ధావ కూడా వేశారట. డైరెక్ట్ గా కాంగ్రెస్ పార్టీనేత రాహుల్ గాంధీకి లెటర్ ద్వారా ఈ విషయాలను రాసినట్లుగా వార్తలు వినిపించాయి. ఇప్పుడు అమల దెబ్బకు ఏకంగా కాంగ్రెస్ పార్టీ దిగివచ్చినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి.



నిన్నటి రోజున అక్కినేని కుటుంబానికి కాంగ్రెస్ పార్టీ నాయకురాలు అయిన ప్రియాంక గాంధీ ఫోన్ చేసి మాట్లాడినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.. ఒక బాధ్యత కలిగిన మంత్రి పదవిలో ఉంటూ ఆమె ఇలా మాట్లాడడం ఎంతవరకు సరైనది అంటూ  ప్రియాంకతో అమల తీవ్రమైన ఆవేదనను తెలియజేసిందట. అయితే ఈ విషయం పైన తాము చర్యలు తీసుకుంటామని.. తమకు జరిగిన ఈ విషయం పైన తనకు కూడా చాలా బాధగా ఉందని ప్రియాంక గాంధీ అమలతో చెప్పినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. అయితే కొండా సురేఖ మాజీ మంత్రి కేటీఆర్ ని టార్గెట్ చేయడం కోసమే నాగార్జున కుటుంబాన్ని ఉద్దేశించి ఆమె ఇలా చేసిన వ్యాఖ్యలు పెను దుమారాన్ని సృష్టించాయి.


ఇప్పుడు దేశవ్యాప్తంగా ఈ విషయం పైన చర్చనీయాంశం జరుగుతోంది. చాలామంది కూడా ఈ ఆరోపణలను ఖండించడమే కాకుండా మంత్రి పైన కూడా ఫైర్ అవుతూ ఆమెకు అధికారాన్ని రద్దు చేయాలంటూ కోరుతున్నారు. సమంత విడాకుల వ్యవహారంలో కేటీఆర్ హస్తం ఉందనే విధంగా వ్యాఖ్యలు చేయడంపై అటు నాగార్జున కుటుంబ సభ్యులు కూడా చాలా సీరియస్ అయ్యారు. కొండా సురేఖ పైన క్రిమినల్ చర్యలు తీసుకోవాలంటూ కూడా కేసులు వేయడం జరిగింది. అక్కినేని అభిమానులు కొండా సురేఖ దిష్టిబొమ్మను కూడా దహనం చేశారు. అయితే ఆ తర్వాత కుండా సురేఖ సమంతకు క్షమాపణలు చెప్పింది.

మరింత సమాచారం తెలుసుకోండి: