అలాగే డిప్యూటీ సీఎం హోదాకు కూడా న్యాయం చేస్తూనే మరొకవైపు సనాతన ధర్మం వైపు కూడా అడుగులు వేస్తూ ముందుకు వెళ్తున్నారు. టీటీడీలో కూడా తన మెంబర్స్ ఉండేలా ప్లాన్ చేస్తున్నారట పవన్ కళ్యాణ్. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ కు చాలా సన్నిహితులుగా ఉన్నటువంటి డైరెక్టర్ త్రివిక్రమ్, ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి అన్న సైతం టీటీడీ బోర్డు సభ్యులుగా నియమించాలనే విధంగా ప్లాన్ చేస్తున్నారట. ఇప్పటికే వీరిద్దరికి సంబంధించి ఫీల్డ్ కవర్లు సీఎంకు ఒక లెటర్ ని పంపించినట్లు సమాచారం.
ఇందులో భాగంగా జనసేన పార్టీకి టిడిపిలో మరో ఇద్దరికి అవకాశాలు వచ్చే విధంగా కనిపిస్తోందట. వాస్తవానికి టాలీవుడ్ నుంచి టీటీడీలోకి సభ్యులుగా రావడం చాలా ఆనవాయితీగా ఉన్నది.. చాలామంది సీనియర్ పేర్లు కూడా ఎక్కువగా వినిపించాయి. టీడీపి తరఫున అశ్వనీదత్, రాఘవేంద్రరావు నెంబర్ రేసులో ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.. గతంలో నాగబాబు పేరు కూడా ఈ వినిపించిన కానీ ఈయనను రాజ్యసభకు పంపే అవకాశాలు ఎక్కువగా ఉండడంతో టీటీడీ పదవికి జనసేన నుంచి తన స్నేహితులను పంపే విధంగా ప్లాన్ చేస్తున్నారట. మరి ఇందులో ఎంత నిజం ఉందో తెలియదు కానీ ప్రస్తుతం అయితే ఈ విషయం హాట్ టాపిక్ గా మారుతున్నది.