తమిళనాడు వర్సెస్ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల మధ్య.. ఇప్పుడు పచ్చ గడ్డి వేస్తే బగ్గుమనేలా వాతావరణం నెలకొంది. దీని అందరికి కారణం ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అని చెబుతున్నారు. సనాతన ధర్మం పేరుతో పక్క రాష్ట్రం  నేతలను కించపరిచేలా పవన్ కళ్యాణ్ మాట్లాడడమే.. ఈ వివాదానికి దారి తీసింది అని చెబుతున్నారు. తమిళనాడు రాష్ట్రంలో కీలక పార్టీ అయిన డిఎంకె డిప్యూటీ ముఖ్యమంత్రి  ఉదయ నిధి స్టాలిన్  ను ఉద్దేశించి పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.


దీంతో స్టాలిన్ కు సంబంధించిన అనుచరులు అలాగే ఆయన ఫ్యాన్స్... ఏపీ డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ టార్గెట్ చేసి మరి... మరిచిపోతున్నారు. మెగాస్టార్ చిరంజీవికి కూడా వార్నింగ్ ఇచ్చారు స్టాలిన్ అభిమానులు. అయితే ఈ నేపథ్యంలో... తనను వ్యతిరేకిస్తున్న  పార్టీకి కౌంటర్ ఇచ్చేలా... ఏపీ డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అదిరిపోయే స్కెచ్ వేశారు. తమిళనాడు రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీగా ఉన్న ఏఐడీఎంకే  పార్టీని జాకీలు పెట్టి.. లేపే ప్రయత్నాలు చేస్తున్నారు పవన్ కళ్యాణ్.


ఎవరు చేయని పోస్ట్ పెట్టి సంచలనానికి దారి తీసారు పవన్ కళ్యాణ్.  అక్టోబర్ 17వ తేదీ నాటికి  ఏఐడీఎంకే పార్టీ  పెట్టి 53 సంవత్సరాలు పూర్తి అవుతుంది. ఈ నేపథ్యంలో ఆ పార్టీకి శుభాకాంక్షలు తెలుపుతూ... ఎంజీఆర్ ఫ్యాన్స్ ను... పొగుడుతూ పోస్ట్ పెట్టారు ఏపీ డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. పురచ్చి తలైవర్ ఎంజీఆర్ పై అభిమానం తాను చెన్నైలో ఉన్నప్పుడు... మొదలైందని సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు.


అయితే పవన్ కళ్యాణ్ తాజాగా చేసిన పోస్ట్... స్టాలిన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉందని కొంతమంది కామెంట్స్ చేస్తున్నారు. వాళ్లను నేరుగా విమర్శించకుండా.. ఏఐడీఎంకే పార్టీకి పవన్ కళ్యాణ్ దగ్గర అవుతున్నారని కొంతమంది చెబుతున్నారు. ఇది ఇలా ఉండగా సనాతన ధర్మంపై.. ఏపి డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు.. హింసాత్మకంగా ఉన్నాయని.. తమిళనాడులో కేసు నమోదు అయింది. స్టాలిన్ కు సంబంధించిన వ్యక్తి... ఈ కేసు పెట్టారని ప్రచారంలో ఉంది. మరి పవన్ కళ్యాణ్ పోస్ట్ కు డీఎంకే ఇలా రియాక్ట్ అవుతుందో చూడాలి.





మరింత సమాచారం తెలుసుకోండి: