సిట్ విచారణకు సంబంధించి సుప్రీంకోర్టు ఫిక్స్‌డ్ షెడ్యూల్ ప్రకటించలేదు. సిట్ సభ్యుల నియామకం ఎప్పుడు, వారు విచారణ ప్రారంభించేది ఎప్పుడు అని చాలామంది ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం తిరుమలలో బ్రహ్మోత్సవాలు కొనసాగుతున్నాయి. టీటీడీ అధికారులకు ఈ వేడుకల పనులతోనే బిజీ అయిపోయారు. భక్తులకు అన్ని ఏర్పాట్లు చేసే ఏం పనుల్లో నిమగ్నమయ్యారు. బ్రహ్మోత్సవాలు ఈ నెల 12తో ముగియనుండగా అప్పటిదాకా టీటీడీ అధికారులు సిట్ విచారణకు ఏమాత్రం సహకరించే అవకాశం లేదు.
అయితే 12వ తేదీలోగా సిట్ సభ్యుల నియామకం కంప్లీట్ అయ్యే అవకాశం ఉంది. అలా ఏర్పాటైన కొత్త సిట్ టీమ్ ఈ నెల 12 నుంచి విచారణ ప్రారంభించి ఈ నెలలోపు అన్ని నిజాలను బయటపెట్టే అవకాశం ఉంది. సీబీఐ పర్యవేక్షణలో కొత్త సిట్ అన్ని అంశాలు చాలా లోతుగా ఇన్వెస్టిగేషన్ చేస్తుంది. అన్ని కోణాల్లో ఏ ఒక్క సమాచారం కూడా వదిలిపెట్టకుండా సిట్ సమగ్ర దర్యాప్తు చేపడుతుంది సీబీఐ డైరెక్టర్, ఏపీ డీజీపీ ఒక్కొక్కరు ఇద్దరి చొప్పున మొత్తం నలుగురు అధికారులను సెలెక్ట్ చేస్తారు. వీరు ఇచ్చే రిపోర్టు ఆధారంగా చంద్రబాబు నిజం చెబుతున్నారా? అబద్ధం చెబుతున్నారా అనేది తేలనుంది. చంద్రబాబు లడ్డూ విషయంలో జగన్ పై బురద చల్లే ప్రయత్నంలో భాగంగా ఆరోపణ చేశారా అనేది కూడా తెలిసిపోతుంది ఆయన నిజ స్వరూపం అనేది ఏపీ ప్రజలతో పాటు మొత్తం భారతదేశానికి తెలుస్తుంది.