2024 ఎన్నికల్లో లోకేశ్ ఎమ్మెల్యేగా గెలిచి మంత్రి కావడం టీడీపీ శ్రేణులకు ఎంతో సంతోషాన్ని కలిగించింది. 2029లో లోకేశ్ సీఎం కావాలని కూటమి అభిమానులు కోరుకుంటున్నారు. చంద్రబాబు సైతం ఇందుకు సుముఖంగా ఉన్నారని తెలుస్తోంది. అయితే లోకేశ్ ను సీఎం చేయడానికి విభిన్నమైన ప్రణాళికతో చంద్రబాబు ముందుకెళ్లనున్నారని పొలిటికల్ వర్గాల్లో జోరుగా వినిపిస్తోంది.
 
2029లో సీఎం అభ్యర్థిగా చంద్రబాబే ఉంటారని అయితే పార్టీ గెలిచిన తర్వాత లోకేశ్ సీఎం అయ్యే విధంగా ప్రణాళికలు ఉన్నాయని సమాచారం అందుతోంది. ఈ విషయంలో చంద్రబాబు తెలివిగా అడుగులు వేస్తున్నారని పొలిటికల్ వర్గాల్లో వినిపిస్తోంది. 2029 సమయానికి కూటమిపై వ్యతిరేకత రాకుండా చంద్రబాబు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. కొన్ని విషయాలకు సంబంధించి జగన్ చేసిన తప్పులను బాబు అస్సలు చేయడం లేదు.
 
మరోవైపు టీడీపీ శ్రేణుల్లో సైతం లోకేశ్ సీఎం కావాలనే ఆకాంక్ష బలంగానే ఉంది. లోకేశ్ చెప్పిన వ్యక్తులకే ఇటీవల నామినేటెడ్ పోస్టులు దక్కాయని తెలుస్తోంది. సినీ ఇండస్ట్రీ ప్రముఖులు సైతం లోకేశ్ కు ఒకింత ఎక్కువగానే ప్రాధాన్యత ఇస్తుండటం హాట్ టాపిక్ అవుతోంది. లోకేశ్ తన స్థాయిని అంతకంతకూ పెంచుకుంటున్నారు. 46 సంవత్సరాల వయస్సులో లోకేశ్ సీఎం అయ్యే ఛాన్స్ ఉంది.
 
నారా లోకేశ్ ప్రజల మద్దతును సైతం గెలుచుకుంటూ పొలిటికల్ కెరీర్ పరంగా అంతకంతకూ ఎదుగుతున్నారు. నారా లోకేశ్ మంత్రిగా తనపై ఉన్న బాధ్యతలను సైతం సక్రమంగా నిర్వహిస్తూ ప్రశంసలు అందుకుంటున్నారు. నారా లోకేశ్ పేరు ఇతర రాష్ట్రాల్లో సైతం ఎక్కువగానే వినిపిస్తోంది. నారా లోకేశ్ ఈ జనరేషన్ లో ఎంతోమందికి స్పూర్తిగా నిలుస్తున్నారనే కామెంట్లు సైతం వ్యక్తమవుతున్నాయి. నారా లోకేశ్ మంగళగిరి అభివృద్ధి దిశగా అడుగులు వేయడంతో పాటు ఎవరైనా కష్టాల్లో ఉంటే వారిని ఆదుకుంటూ వార్తల్లో నిలుస్తున్నారు. ఈ విషయంలో నారా లోకేశ్ కు ఎవరూ సాటిరారని చెప్పవచ్చు.


మరింత సమాచారం తెలుసుకోండి: