* చంద్రబాబు తరువాత పార్టీలో అంతరయుద్ధం తప్పదా

* బాలయ్య పార్టీని ముందుండి నడిపిస్తారా..?

* ఎన్టీఆర్ సీన్ లోకి వస్తే లోకేష్ పరిస్థితి ఏంటి..?



ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ చర్యలు భరించలేక తెలుగు వాడి ఆత్మ గౌరవాన్ని కాపాడేందుకు ఆనాడు స్వర్గీయ నందమూరి తారకరామారావు గారు తెలుగుదేశం పార్టీని స్థాపించారు..1983 ఎన్నికల్లో పోటీ చేసిన తెలుగుదేశం పార్టీ అఖండ విజయాన్ని సాధించింది.. పార్టీని స్థాపించిన 9 నెలల్లోనే అధికారంలోకి తీసుకువచ్చిన ఏకైక నాయకుడు ఎన్టీఆర్ మాత్రమే.. ఎన్టీఆర్ ప్రవేశపెట్టిన పధకాలు ప్రజలకు ఎంతగానో ఉపయోగపడ్డాయి.. అధికారంలోకి వచ్చాక ఎన్టీఆర్ రాష్ట్రంలో ఎన్నో సంస్కరణలు చేసారు.. ప్రతి పేదవాడికి ఎన్టీఆర్ అండగా నిలబడ్డారు.. పార్టీలో ఎన్టీఆర్ పై వచ్చిన బేధాబిప్రాయాలు వల్ల రెండో విడత గెలిచిన కొద్ది కాలానికే ఎమ్మెల్యే ల సపోర్ట్ అంతా చంద్రబాబు వైపు ఉండటంతో ఎన్టీఆర్ ముఖ్యమంత్రి పదవిని వదులుకోవాల్సి వచ్చింది.. ఆ దిగులుతోనే ఎన్టీఆర్ కన్నుమూశారు.. అప్పటి నుంచి మామని వెన్నుపోటు పొడిచి చంద్రబాబు సీఎం అయ్యారని ప్రతిపక్షాలు నేటికీ చంద్రబాబుని వేలెత్తి చూపుతున్నాయి.. ఎన్టీఆర్ తరువాత ఆయన వారసులు చాలా మంది వున్న చంద్రబాబు టీడీపీ పగ్గాలు చేపట్టడాన్ని చాలా మంది నందమూరి అభిమానులు జీర్ణించుకోలేకపోయారు.. అయితే చంద్రబాబు తన పాలనలో వైవిద్యత చూపడంతో ప్రజల నుంచి వస్తున్న వ్యతిరేకత కాస్త అయినా తగ్గించగలిగారు. అయితే నందమూరి వంశం వల్ల ఎప్పటికైన డేంజర్ అని పసిగట్టిన చంద్రబాబు బాలయ్య పెద్ద కూతురు బ్రాహ్మణిని తన కొడుకు లోకేష్ కి ఇచ్చి వివాహం చేసారు. దీనితో బాలయ్య చంద్రబాబుకి వియ్యంకుడు అయ్యాడు..

అయితే నందమూరి వంశంలో చంద్రబాబుకు హరికృష్ణ పెద్ద సమస్యగా మారారు..ఆయన ముక్కుసూటి మనిషి కావడం వున్నది ఉన్నట్లు బయటకు చెప్పే వ్యక్తి కావడంతో చంద్రబాబుతో చాలా సార్లు విభేదాలు వచ్చాయి. అయినా కూడా హరికృష్ణ చంద్రబాబును సీఎం పదవీనుంచి తొలగించలేకపోయారు..హరికృష్ణతో ఎలాగైనా సాన్నిహిత్యం పెంచుకోవాలనుకున్న చంద్రబాబు హరికృష్ణ చిన్న కొడుకు ఎన్టీఆర్ని టీడీపీ తరుపున 2009 ఎన్నికల ప్రచార భాద్యతను అప్పగించారు.ఆ సమయంలో ఎన్టీఆర్ టీడీపీ తరుపున భారీగా ప్రచారం చేసిన టీడీపీ ఆ ఎన్నికల్లో ఓడిపోయింది.. దీనితో చంద్రబాబుకు హరికృష్ణ కు దూరం పెరిగింది.. కొన్నాళ్ళకు హరికృష్ణ మరణించడంతో ఎన్టీఆర్ రాజకీయలలోకి వస్తాడని అంతా అనుకున్నారు.. కానీ ఎన్టీఆర్ రాజకీయాలపై ఎందుకో మౌనంగా ఉంటున్నాడు.. చంద్రబాబు తన కొడుకు లోకేష్ ని ప్రత్యక్ష రాజకీయాలలోకి తీసుకొచ్చారు.. ప్రారంభంలో లోకేష్ తడబడ్డా కూడా ఇప్పుడు పుంజుకున్నాడు.. 2024 ఎన్నికల్లో లోకేష్ భారీ మెజారిటీతో గెలిచారు.. అయితే చంద్రబాబు తరువాత టీడీపీ పగ్గాలు ఎవరికి వెళ్తాయి అనే ప్రశ్న జోరుగా సాగుతుంది.. లోకేష్ పార్టీని సమర్ధవంతంగా నడపగలరా.. లేక తన తండ్రి పార్టీని బాలయ్య ముందుండి నడిపిస్తారా అనేది ప్రశ్నగా మారింది.. సరికొత్తగా బ్రాహ్మణి కూడా లిస్ట్ లో చేరింది దీనితో చంద్రబాబు తరువాత పార్టీ పరిస్థితి ఏంటి అనే దానిపై తెలుగు తమ్ముళ్లలో తీవ్ర చర్చ జరుగుతుంది.. పార్టీ పెద్దగా బాలయ్య కొనసాగుతూ లోకేష్ ని మరింత ప్రోత్సహిస్తారని కొందరు అంటున్నారు.. లేదు ఎన్టీఆర్ రంగంలోకి దిగుతారని కొందరు అంటున్నారు.. టీడీపీ లో అంతర యుద్ధం వస్తుందని చాలా మంది భయపడుతున్నారు.. మరీ టీడీపీ లో ఏం జరుగుతుందో చూడాలి..

మరింత సమాచారం తెలుసుకోండి: