* కూటమి ప్రభుత్వానికి ఈ అయిదేళ్లు పెద్ద పరీక్షే.!
* ప్రజామద్దతుకు దూరమైతే టీడీపీ భవిష్యత్తు అంధకారమే.?
* రేవంత్ పాలనా చూపించి..2029 ఎన్నికల్లో కాంగ్రెస్ ఫాంలోకి రానుందా.?

(ఏపీ-ఇండియాహెరాల్డ్): ఏపీలో జరిగిన 2024 సార్వత్రిక ఎన్నికలు అనేవి గతంలో ఎన్నడూ జరగని, ఊహించని విధంగా ఫలితాలు ఇచ్చాయి.2014లో టీడీపీ అధికారం చేపట్టాక జగన్ ప్రతిపక్షానికి పరిమితం అయ్యారు. అయితే 2019 ఎన్నికలు లక్ష్యంగా పెట్టుకున్న జగన్ దానికి సంబంధించి చేసిన పాదయాత్ర బాగా కలిసోచ్చి ఆయనకు 151సీట్లు సంపాదించి పెట్టి రాష్ట్రంలో ఇదివరకు ఎపుడు లేనివిధంగా భారీ విజయాన్ని అందించింది. దాంతో 2019లో ఆయన సీఎం సీట్ ఎక్కారు. అయితే సీఎంగా రాష్ట్ర బాధ్యతలు చేపట్టిన జగన్ మొదటి మూడేళ్లు పాలనా పరంగా సక్సెస్ అయ్యారు. మానిఫెస్టోలో చెప్పిన విధంగా చేసుకుంటాపోయారు కాకపోతే చివరి రెండేళ్ల పాలనా కొన్ని వర్గ ప్రజలలో జగన్లో నియంత విధానాలు గమనించారు. ప్రభుత్వఉద్యోగులను, నిరుద్యోగులను విస్మయించారు అలాగే టీడీపీ అధినేత చంద్రబాబు జైలుకు పోవడానికి కారణం అయ్యారు.దాంతో ప్రజా తిరుగుబాటు మొదలైంది కానీ దాన్ని లెక్కచేయని జగన్కు 2024 ఎన్నికల్లో మంచి గుణపాఠం చెప్పారు రాష్ట్ర ప్రజలు. అయితే టీడీపీ రాజకీయా భవిష్యత్తు దృష్టిలో పెట్టుకొని 2024 ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ, జనసేన కూటమిగా ఏర్పడి వైసీపీకి తొక్కేయడమే లక్ష్యంగా పెట్టుకొని బరిలోకి దిగితే 164 సీట్లు కైవసం చేసుకొని కేవలం 11 సీట్లకే వైసీపీకి పరిమితం చేసి ప్రతిపక్ష హోదాకూడా లేకుండా చేశారు.

అయితే కూటమి ప్రభుత్వం మేనిఫెస్టోలో సూపర్ సిక్స్ హామీలో భాగంగా ముందుకు పోతుంది దాంట్లో భాగంగానే మొదటి సంతకం డియస్సీ ఫైల్ పై సంతకం పెట్టి సీఎంగా బాధ్యతలు స్వీకరించారు.అయితే రాష్టంలో గత ఆరేళ్ళ నుండి ఒక్క డియస్సీ కూడా కండక్ట్ చేయలేదని నిరుద్యోగులు తీవ్ర నిరాశతో ఉన్నారు. మొదటి సంతకంలో భాగంగా డియస్సీ నిర్వహణలో మాత్రం సీఎం చంద్రబాబు సక్సెస్ కాలేకపోతె నిరుద్యోగుల నుండి గట్టిగ ఎదురు దెబ్బ తగులుతుంది. ఒకవైపు తెలంగాణలో కూడా డియస్సీ నిర్వాహనే కీలకంగా అధికారం చేపట్టిన రేవంత్ సర్కార్ చెప్పినట్టుగా డియస్సీ నిర్వహించి నియామక పత్రాలు కూడా ఇవ్వడానికి సిద్ధం అవుతుంది.అయితే ఏపీలో డియస్సీ నిర్వహణలో అలసత్వం వహిస్తే మాత్రం కూటమి ప్రభుత్వానికి నిరుద్యోగులు మరల షాక్ ఇస్తారు. తెలంగాణాలో రేవంత్ పాలనా చూపించి ఏపీలో కూడా కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల దూసుకుపోతుంది. మేనిఫెస్టోలో భాగంగా డియస్సీ అనే అంశం చూపించి నిరుద్యోగులని ఆకట్టుకొని 2029 ఎన్నికల్లో ముందుకుపోయే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి.

విభజిత ఆంధ్రాలో కాంగ్రెస్ అనేది ఒక్క పర్యాయం కూడా రాష్ట్ర పాలనా చేపట్టలేదు.ఏ పార్టీ పైనైనా మాక్సిమం రాష్ట్ర ప్రజలకు పదేళ్ల తర్వాత ఒకరకామైన నిరాశ నిస్పృహలు వస్తాయి.కూటమి ప్రభుత్వం చేసే ఈ ఆయిదేళ్ల పాలనా అనేది టీడీపీ రాష్ట్ర భవిష్యత్తును డిసైడ్ చేస్తుంది లేదంటే వచ్చే 2029 ఎన్నికల్లో మాత్రం ప్రజలు కచ్చితంగా కాంగ్రెస్ వైపు ఆశతో చూస్తారనడంలో ఆశ్చర్యం లేదు.అయితే టీడీపీ పార్టీ పగ్గాలు చంద్రబాబు తన కొడుకైనా నారా లోకేష్ కు ఇవ్వాలనుకోవడంతో ఆయన ఈ అయిదేళ్ల పాలనాలో ప్రజామద్దతు కోసం కచ్చితంగా మేనిఫెస్టులో అంశాలు అమలు చేయాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: