- చంద్రబాబుకి అసలైన ప్రత్యర్థి పవణే..
- ఐదేళ్లలో తిరుగులేని శక్తిగా ఎదుగుతారా..

 ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ రాష్ట్రం వేరైనా తర్వాత  ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మొదటిసారి చంద్రబాబు నాయుడు సీఎం అయ్యారు.  ఐదేళ్ల పాలనలో ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడి ఆ తర్వాత 2019లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టారు. అద్భుతమైన మెజారిటీతో  వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఐదు సంవత్సరాలు పాలించారు.  ఆయన పాలనలో ఎన్నో పథకాలు, ఎన్నో అభివృద్ధి పనులు చేశారు. అయినా 2024 ఎలక్షన్స్ లో మాత్రం  వైసిపి దారుణంగా ఓడిపోయింది. 175 అసెంబ్లీ స్థానాలకు కాను కేవలం 11 స్థానాలకే వైసీపీ పరిమితమైంది. ఈ విధంగా ఏపీలో  వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ దారుణంగా ఓడిపోయింది. ఇక టిడిపి కూటమి 164 సీట్లతో అద్భుతమైన మెజారిటీ సాధించింది. అంత మెజారిటీ సాధించడానికి ప్రధాన కారకులు జనసేన పార్టీ అని చెప్పవచ్చు. జనసేన పార్టీతో పొత్తు పెట్టుకోవడం వల్ల ఓట్లు చీలిపోకుండా ఉండి అద్భుత మెజారిటీ సీట్లుగా  మారిపోయాయి. ఒకే దెబ్బకు టిడిపి అధికారంలోకి  రావడమే కాకుండా జనసేన పార్టీ కూడా నిలబడి లేచిందని చెప్పవచ్చు.

 అస్తిత్వాన్ని  పొందిన పవన్:
 గత రెండు పర్యాయాలు జనసేన పార్టీ కనీసం  ఏ నియోజకవర్గంలో కూడా బోణి కొట్టలేదు. చివరికి పవన్ కళ్యాణ్ కూడా ఓడిపోయారు. కానీ  ఆయన జనసేన పార్టీ పరిస్థితి గమనించి టీడీపీతో పొత్తు పెట్టుకోవడానికి బిజెపితో కలిసి వచ్చారు.  అనుకున్న దాని ప్రకారం పార్టీతో పొత్తు పెట్టుకుని అద్భుతమైన మెజారిటీ అందించి అధికారంలోకి వచ్చి డిప్యూటీ సీఎం గా బాధ్యతలు చేపట్టారు. అలాంటి పవన్ కళ్యాణ్  ఈ ఐదు సంవత్సరాల్లో తాను ఎదగడమే కాకుండా జనసేన పార్టీని అద్భుతమైన శక్తిగా తయారు చేసే అవకాశం ఉంది.  నెక్స్ట్ ఎలక్షన్స్ వరకు కనీసం పొత్తు లేకుండా ప్రతి నియోజకవర్గంలో స్వయంగా పోటీ చేసి గెలిచే  స్థాయికి ఎదుగుతారని చెప్పవచ్చు. ఒకవేళ వీరి మధ్య సఖ్యత కుదరక పొత్తు లేకపోతే మాత్రం  తప్పకుండా జనసేన పార్టీ మెజారిటీ సీట్లను గెలిచి అధికారంలోకి వచ్చే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ ఎలక్షన్స్ వరకు చంద్రబాబుకు వయసు మీద పడుతుంది కాబట్టి పార్టీని లీడ్ చేసే నాయకుడు అందులో లేకుండా పోతారు. దీనివల్ల  వైసిపి మరియు  జనసేన పార్టీ మధ్య పోటీ ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ఆ ఎన్నికల్లో విజయం సాధిస్తే వైసిపి లేదంటే జనసేన అధికారంలోకి వచ్చే అవకాశం ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: