అయితే ఇప్పుడు మరోసారి ఆ విషయం క్లియర్గా స్పష్టం కాబోతుంది. హర్యానా అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ సంపూర్ణ మెజార్టీతో గెలిచే అవకాశం ఉంది అని.. ఎగ్జిట్ పోల్స్ తేల్చి చెబుతున్నాయి.
ఈ విషయంలో నెంబర్లు తేడా ఉండొచ్చు కానీ.. అందరిదీ ఒకటే మాట. హర్యానా కాంగ్రెస్ దే అని.. మరోవైపు జమ్ము కాశ్మీర్లో కూడా నేషనల్ కాన్ఫరెన్స్ కాంగ్రెస్ కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసే ఛాన్సులు ఎక్కువగా ఉన్నట్టు ఎగ్జిట్ పోల్స్ చెబుతున్నాయి. కొంతమంది హంగ్ అని చెబుతున్నారు. ఎన్నికలు జరిగిన రెండు చోట్ల బిజెపి అధికారంలోకి వచ్చే ఛాన్సులు లేవు అన్న సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
దేశ రాజధాని ఢిల్లీ పక్కనే ఉండే హర్యానాలో మూడోసారి కూడా అధికారం నిలబెట్టుకోవాలని బిజెపి చేసిన ప్రయత్నాలు ఏమీ ఫలించలేదు. మరోవైపు ఏడాది చివరి అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న అత్యంత కీలక రాష్ట్రమైన మహారాష్ట్రలో కూడా బిజెపి గెలుపు సాధ్యం కాదు అని అంచనాలు వెలువడుతున్నాయి. ఇప్పుడు మహారాష్ట్రలో బిజెపి.. శివసేన ( షిండే వర్గం ) - ఎన్సీపీ చీలిక గ్రూపుతో కలిసి ప్రభుత్వాన్ని నడుపుతుంది. అధికారం కోసం బిజెపి చేసిన ఈ చీలికల రాజకీయమే వచ్చే ఎన్నికలలో మహారాష్ట్రలో బీజేపీని దారుణంగా దెబ్బ కొట్టే అవకాశం ఉందన్న అభిప్రాయాలకు వ్యక్తం అవుతున్నాయి. మహారాష్ట్రలో కూడా బిజెపి ఓడిపోతే మోడీకి రాజకీయంగా మోడీకి చుక్కలు కనపడడం స్టార్ట్ అయినట్టే అవుతుంది. అప్పుడు మోడీ ఇమేజ్ మరింత మసకబారటం ఖాయం. మోడీ మ్యాజిక్ అనేది దాదాపు చివరి దశకు వచ్చేసినట్టు అవుతుంది.
[9:03 am, 7/10/2024] v Subhash: