ఆయన కుటుంబ సభ్యులు... ముంబైలోని బ్రిడ్జ్ క్యాండీ అనే ఆసుపత్రిలో రతన్ టాటా ను చేర్పించినట్లు..నేషనల్ మీడియాలో కూడా కథనాలు వచ్చాయి. ప్రముఖ వ్యాపారవేత్త రతన్ టాటాకు బీపీ ఎక్కువైందని... దీంతో అర్ధరాత్రి.. ఆస్పత్రికి తరలించినట్లు కొంతమంది ప్రచారం చేస్తున్నారు. దీంతో రతన్ టాటా అభిమానులు..ఆయన కంపెనీలో పని చేసే వారందరూ..ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
దేశవ్యాప్తంగా రతన్ టాటా పేరుతో సోషల్ మీడియాలో.. హాష్ ట్యాగ్ కూడా ట్రెండ్ అవుతుంది. ఇలాంటి నేపథ్యంలో రతన్ టాటా... స్వయంగా తన హెల్త్ అప్డేట్ ఇచ్చారు. తనకు ఎలాంటి అనారోగ్య సమస్యలు జరగలేదని..తాను ఆరోగ్యంగా ఉన్నట్లు ప్రకటించారు. తన ఆరోగ్యం పట్ల ఎవరూ కూడా....ఆందోళన చెందాల్సిన పనిలేదని కూడా కోరారు. కొంతమంది తప్పుడు ప్రచారం చేస్తున్నారని.. గతంలో కూడా ఈ...ప్ర చారం జరిగిందని రతన్ టాటా పేర్కొన్నారు.
తన వయసు ఇప్పటికే 80 ఏళ్ళు దాటిపోయింది...ఈ సమయంలో అనారోగ్య సమస్యలు చాలా సాధారణమని తెలిపా రు. అందుకే రెగ్యు లర్ చెకప్ కోసం.. మాత్రమే ఆసుపత్రికి వెళ్లినట్లు ప్రకటించారు రతన్ టాటా. తాను ప్రస్తుతం చాలా క్షేమంగా ఆరోగ్యంగా ఉన్నానని వెల్లడిం చారు. తప్పుడు వార్తలను ఎవరు నమ్మకూడదని ప్రముఖ వ్యాపారవేత్త రతన్ టాటా...ఓ అధికారిక ప్రకటన కూడా విడుదల చేశారు. ఇక రతన్ టాటా తన ఆరోగ్యంపై స్వయంగా ప్రకటన చేయడంతో.. ఆయన అభిమానులు కాస్త శాంతించారు.