ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఇటీవల ఏర్పాటు అయిన సంగతి తెలిసిందే. అయితే... అనేక హామీలు ఎన్నికల కంటే ముందు ఇచ్చి.. గద్దెనెక్కింది కూటమి సర్కార్. అయితే ఎన్నికల కంటే ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో... కూటమి ప్రభుత్వం అతలాకుతలం అవుతున్న సంగతి తెలిసిందే. కేవలం.. పెన్షన్ లిమిట్ పెంచి ప్రజలకు ఇస్తోంది చంద్రబాబు కూటమి సర్కార్. మిగతా ఏ పథకాలు కూడా అమలు చేయడం లేదు. త్వరలోనే అమలు చేస్తామని దాటి వేస్తూ వస్తుంది.

అయితే ఇలాంటి నేపథ్యంలో... ఏపీలో కొత్త అంశం తెరపైకి వచ్చింది. తెలంగాణ రాష్ట్రం తరహాలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో.. మరోసారి జిల్లాలను పెంచబోతున్నారని చర్చ జరుగుతోంది.  ప్రస్తుతం 26 జిల్లాలను 30 జిల్లాలుగా పెంచేందుకు చంద్రబాబు సర్కార్ నిర్ణయం తీసుకున్నట్లు సోషల్ మీడియాలో వార్త వైరల్ అవుతుంది. అలాగే కొన్ని జిల్లాల పేర్లు మార్చి.. కొన్ని జిల్లాలను తొలగించి.. కొత్త జిల్లాలకు అవకాశం ఇచ్చేందుకు చంద్రబాబు ఈ దిశగా అడుగులు వేస్తున్నట్లు సోషల్ మీడియాలో.. కథనాలు నిన్నటి నుంచి వస్తున్నాయి.

ముఖ్యంగా.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని 30 జిల్లాలుగా పునర్ విభజించి.. పలస నాగవల్లి నూజివీడు తెనాలి అమరారామ మార్కాపురం మదనపల్లి హిందూపురం ఆదోని  లాంటి ప్రాంతాలను కొత్త జిల్లాలుగా ప్రకటించే ఛాన్స్ ఉన్నట్లు సోషల్ మీడియాలో ఒక కథనం వైరల్ గా మారింది. ముఖ్యంగా.. ఎన్టీఆర్ సొంత ఊరు నిమ్మకూరు ఉన్న ప్రాంతానికి ఎన్టీఆర్ మచిలీపట్నం జిల్లాగా మార్చనున్నారట. అలాగే కడప జిల్లాకు వైయస్సార్ కడప జిల్లా పేరు పెట్టాలని ఇప్పటికే డిమాండ్లు వస్తున్నాయి.


అటు ప్రస్తుతం ఉన్న ఎన్టీఆర్ జిల్లాను కృష్ణాజిల్లాగా మార్చేందుకు రంగం సిద్ధం చేస్తున్నారట. ఇలా ప్రస్తుతం ఉన్న 26 జిల్లాలలో.... అలా వరకు మార్పులు చేసి 30 జిల్లాలుగా విస్తరించినందుకు రంగం సిద్ధం చేశారట. అయితే దీనిపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ మాత్రం అధికారిక ప్రకటన ఎక్కడ చేయలేదు. ఇదంతా ఫేక్ వార్త అని అంటున్నారు. వట్టి ప్రచారమేనని.. ఎవరూ నమ్మకూడదని కోరుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: