అలాగే వీరితో పాటు మరో మాజీ ఎమ్మెల్యే తీగల లక్ష్మారెడ్డి కూడా చంద్రబాబు తో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. భేటీ తర్వాత మాట్లాడిన నేతలు కీలక వ్యాఖ్యలు చేశారు. తమ ఇంట్లో జరిగే పెళ్లికి చంద్రబాబును ఆహ్వానించేందుకే తాము పేటి అయినట్టు మల్లారెడ్డి ప్రకటించారు. అంతకుమించి దీని వెనక ఎలాంటి ప్రాధాన్యత లేదని అన్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి తెలుగుదేశం పార్టీలోకి చేరడానికి ఇప్పటికే రంగం సిద్ధమైంది. గత కొన్ని నెలలుగా టిడిపిలోకి వస్తారని వార్తలు కూడా వస్తున్నాయి. ఇప్పుడు వాటిని నిజం చేస్తూ త్వరలోనే ఆయన టిడిపిలో చేరబోతున్నట్టు తెలుస్తుంది.
ఈ నేపథ్యంలో హైదరబాద్‌లో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడును మల్లారెడ్డి కలిసినట్టు తెలుస్తోంది. తన మనవరాలు శ్రేయరెడ్డి పెళ్లికి ఆహ్వానించడం కోసమే చంద్రబాబును కలుస్తున్నట్టు కలరింగ్ ఇచ్చినప్పటికీ మల్లారెడ్డి అసలు ఉద్దేశం టీడీపీ లో చేరడమేనని తెలుస్తోంది. ఇప్పుడు టీడీపీ లో చేరేందుకు కీలకమైన నేతలు అంగీకరం తెలపుతున్న వేళ పార్టీని బలోపేతం చేసే దిశగా ప్రయత్నాలు సాగాలి తెలంగాణ నేతలు సూచిస్తున్నారు . పార్టీకి ఎవరు ఎంత వరకు అవసరమో గుర్తించి సరైన నిర్ణయం తీసుకోవాలని వారు అంటున్నారు. మరోసారి వలస నేతలతో మోసపోవద్దు అంటూ కూడా చంద్రబాబుకు సలహా ఇస్తున్నారు.