ఈ ఏడాది ఎన్నికలు మొదల నుంచి ఆంధ్రప్రదేశ్లోని రాజకీయాలు హాట్ టాపిక్ గా మారుతూనే ఉన్నాయి.. ముఖ్యంగా కూటమి ప్రభుత్వం కొలువు తీరి ఇప్పటికీ  నాలుగు నెలలు కావస్తువున్న ఇచ్చిన హామీలను సైతం అమలు చేయలేదని పలువురు నేతలతో పాటు ప్రజలు కూడా ఈ విషయాలను కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉన్నారు. అయితే కూటమి నేతలు మాత్రం రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఇంత దారుణంగా రావడానికి కారణం గత ప్రభుత్వమే అంటూ చెప్పుకొస్తున్నారు. ఇలాంటి సమయంలోనే మాజీ సీఎం జగన్ కు ఒక సవాలు విసిరారు బీజేపీ ఎమ్మెల్యే.



బిజెపి ఎమ్మెల్యే ఎవరో కాదు ఆదినారాయణ రెడ్డి. జగన్కు దమ్ము ఉంటే వచ్చే ఎన్నికలలో జమ్మలమడుగు నియోజవర్గంలో తన పైన పోటీ చేయాలంటూ ఒక సవాల్ని సైతం విసరడం జరుగుతోంది. ఇటీవలె టిడిపి నేతతో కలిసి మెగా జాబ్ మేళాను ప్రారంభించిన సందర్భంగా ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి ఇలాంటి సవాల్ మాజీ సీఎం జగన్కు విసిరారు.. జమ్మలమడుగు నియోజవర్గంలో వైసిపి నాయకులు తనకు ఏమాత్రం సమానం కాదని  ఎద్దేమో చేశారు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి.


దమ్ముంటే నేరుగానే జగన్ తన పైన పోటీ చేయాలంటూ ఒక సవాల్ని విసిరారు.. ముఖ్యంగా కూటమి ప్రభుత్వాన్ని వైసీపీ నేతలు సుధీర్ రెడ్డి రామసుబ్బారెడ్డి వంటి వారు ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే అసలు సహించేది లేదంటూ కూడా తెలియజేశారు ఆదినారాయణ రెడ్డి. ప్రభుత్వ స్థలాలను చాలామంది వైసిపి నాయకులే కబ్జా చేయడం జరిగిందని వాటన్నిటిని కూడా బయటికి పెడతానని ఇదే క్రమంలో సంక్రాంతి నాటికి రాజోలు జలాశయ నిర్మాణం పూర్తి చేస్తానని అలాగే గండికోట ముంపు పరిహారం కూడా చెల్లించే బాధ్యతలను చేపడతానని టిట్కో ఇల్లా పంపిణీ కూడా పూర్తి చేస్తానంటూ తెలియజేశారు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి. మరి జగన్కు చేసిన ఈ సవాలు పైన వైసిపి నేతలు ఎలా తిప్పి కొడతారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: