పిఠాపురంలోని ఘటన నిన్నటి రోజున రాత్రి ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఆ మిస్సయిన బాలిక మేనత్త పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ ఉదాంతం బయటపడింది.. పిఠాపురం కి చెందిన పదహారేళ్ల బాలిక స్టేట్ బ్యాంక్ నుంచి నడుచుకుంటూ ఇంటికి తిరిగి వస్తూ ఉండగా ఆటో నడుపుకుంటూ వచ్చిన ఒక వ్యక్తి అతనితోపాటు మరొక మహిళ ఈ బాలికను అడ్రస్ చూపించమని అడుగుతూ మత్తుమందుతో కిడ్నాప్ చేసి ఆటోలో ఎక్కించుకొని మరి .. ఆ బాలికకు మద్యం తాపీ అత్యాచారం పాల్పడ్డారట..
అలా మద్యం మత్తులో పడిపోయిన ఆ బాలికలను ఎత్తుకొని వెళుతున్న సంఘటన ప్లాస్టిక్ కవర్లు ఏరుకుంటూ ఒక మహిళ చూసి వీరిని ప్రశ్నించిందట. అయితే వెంటనే ఈ విషయాన్ని ఆ బాలిక బంధువులకు అందించిందట. అపస్మారక స్థితిలో ఉన్న ఆ బాలికను సైతం వెంటనే గుర్తించిన బంధువులు ఆసుపత్రికి తరలించి వైద్య పరీక్షలు నిర్వహించగా అత్యాచారానికి గురైంది అంటూ తెలియజేశారట. అయితే ఈ అత్యాచారానికి పాల్పడింది.. టిడిపి పట్టణ అధ్యక్షురాలుగా ఉన్న భర్తనే అంటూ అక్కడ నిందితులు తెలియజేశారట. దీంతో పోలీసులు ఆ నిందితులను సైతం అదుపులోకి తీసుకొని మరి విచారిస్తున్నట్లు సమాచారం. అయితే ఈ విషయం పైన అటు చాలామంది పవన్ కళ్యాణ్ ను ఏకీపారేస్తున్నారు.. ఎన్నికల ముందు పవన్ కళ్యాణ్ ఏవేవో మాటలు చెప్పారు..ఇప్పుడు తన సొంత నియోజకవర్గంలోని అది చిన్నపిల్లల పైన ఇలాంటి సంఘటనలు జరుగుతూ ఉంటే కనిపించడం లేదా అంటూ ఫైర్ అవుతున్నారు. సొంత నియోజకవర్గంలోని కాపాడలేని డిప్యూటీ సీఎం ఆంధ్రప్రదేశ్ మహిళలను ఎలా కాపాడుతారు అంట ఫైర్ అవుతున్నారు. మరి ఈ విషయం పైన పవన్ కళ్యాణ్ ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి..