ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇటీవల ఏర్పాటు అయిన చంద్రబాబు కూటమి ప్రభుత్వంపై... అనేక అనుమానాలు వస్తున్నాయి. చాలా బలంగా ఉన్న వైసీపీ పార్టీ కేవలం 11 స్థానాలకు పరిమితం కావడం... అటు ధర్మవరం లాంటి నియోజకవర్గం లో బిజెపి గెలవడం.. జనసేన 100% స్ట్రైక్ రేట్ సంపాదించడం పట్ల కూడా చాలామంది అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అలాగే ఎప్పుడు సరైన ఫలితాలు అంచనా వేసే సర్వే సంస్థలు కూడా.. అందుకోలేని రిజల్ట్స్ ఏపీలో వచ్చాయి.

 

ముఖ్యంగా ఆరా మస్తాన్ సర్వే సంస్థ.. ఫలితాలు మొత్తం తారు మారయ్యాయి. ఇప్పటివరకు ఆరా మస్తాన్ చేసిన సర్వే... ఎక్కడ కూడా  తప్పు కాలేదు. మినిమం గ్యారంటీతో ఆరా మస్తాన్  సర్వే సంస్థ దూసుకు వెళ్తోంది. కానీ ఏపీ ఫలితాల విషయంలో ఆరా మస్తాన్ చెప్పినట్లుగా కాకుండా... అసలు సామాన్య పౌరుడు ఊహించలేని ఫలితాలు వచ్చాయి. కచ్చితంగా 100 సీట్ల వరకు వైసిపి వచ్చి..  అధికారం దక్కించుకునే ఛాన్స్ ఉందని ఆరా అంచనా వేయడం జరిగింది.


 కానీ కూటమి ప్రభుత్వం ఏపీలో ఏర్పడడంతో..  అప్పటినుంచి ఆరా మస్తాన్ పై.. తెలుగు తమ్ముళ్లు రెచ్చిపోయి మాట్లాడుతున్నారు. తప్పులు ఎవరైనా చేస్తారు... కానీ ఒక మిస్టేక్ జరిగితే ఆరా మస్తాన్ ను ఇలా వేధించడం కూడా తప్పే అంటున్నారు. అయితే.. ఎన్నికల ఫలితాల  నుంచి సైలెంట్ గా ఉన్న ఆరా మస్తాన్... ఇప్పుడు మళ్లీ యాక్టివ్ అయ్యారు.  చంద్రబాబు కూటమి ప్రభుత్వంపై.. జగన్మోహన్ రెడ్డి కంటే ఎక్కువగా పోరాటం చేస్తున్నారు.

 మొన్నటికి మొన్న . ఫామ్ 20 పైన.. పెద్ద పోరాటమే చేశారు ఆరా మస్తాన్. పోలింగ్ జరిగిన తర్వాత ఫామ్ 20 అధికారిక వెబ్సైట్లో ఎందుకు పెట్టలేదని ఆయన నిలదీయడం జరిగింది. వాసవంగా ఈ ఫామ్ 20ని 48 గంటలోపే అధికారిక వెబ్సైట్లో పెట్టాలి. కానీ ఆ పని చేయకుండా... ఎన్నికల సంఘం.. పెద్ద తప్పిదమే చేసినట్లు ఆరా మస్తాన్ ప్రశ్నించారు. అయితే ఆరా మస్తాన్ దీనిపై పెద్ద పోరాటం చేస్తున్న నేపథ్యంలో.. ఈ ఫామ్ 20 ని అప్లోడ్ చేశారట. తిరుమల శ్రీవారి లడ్డు వివాదం జరుగుతున్న నేపథ్యంలో సైలెంట్ గా.. అప్లోడ్ చేసినట్లు చెబుతున్నారు. అయితే దీనిపై ఆరా మస్తాన్.. నిలదీసేందుకు రెడీ అవుతున్నట్లు సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: