తిరుమల లడ్డు వివాదంలో ఎన్ని ట్విస్టులు చోటు చేసుకున్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ వివాదంలో అసలు తప్పు ఎవరిదో అసలు దోషులెవరో తెలియాలంటే మాత్రం స్వతంత్ర సిట్ ఇచ్చే నివేదిక వెలువడే వరకు ఆగాల్సిందేనని చెప్పవచ్చు. అయితే టీటీడీ ప్రతిష్టను దెబ్బ తీసే విధంగా సాక్షి పత్రికలో కథనం ప్రచురితం కాగా తిరుమల టూ టౌన్ పోలీస్ స్టేషన్ లో ఇందుకు సంబంధించి కేసు నమోదైంది.
 
ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా తిరుమలకు వచ్చిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో అధికారులతో సమీక్ష నిర్వహించగా ఆ సమీక్ష గురించి అసత్య కథనం ప్రచురించడం విషయంలో తిఉమల ఆలయ డిప్యూటీ ఈవో లోకనాథం ఫిర్యాదు చేయడం హాట్ టాపిక్ అవుతోంది. ఈ ఫిర్యాదు ఆధారంగా సాక్షి యాజమాన్యంపై వేర్వేరు సెక్షన్ల కింద కేసు నమోదు చేయడం జరిగింది.
 
ఈ నెల 5వ తేదీన చంద్రబాబు నాయుడు స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించడానికి తిరుమలకు వచ్చారు. సాక్షి పత్రికలో ప్రచురితమైన విషయాలన్నీ అసత్యాలే కావడంతో లోకనాథం ఈ ఫిర్యాదు చేశారు. ఆ సమావేశంలో నేను కూడా పాల్గొన్నానని చంద్రబాబు చెప్పని విషయాలను చెప్పినట్టు సాక్షి పత్రిక ప్రచారం చేసిందని లోకనాథం చెప్పుకొచ్చారు.
 
ఈ కేసు విషయంలో ఎలాంటి ట్విస్టులు చోటు చేసుకుంటాయో చూడాల్సి ఉంది. ఉద్దేశపూర్వకంగానే అసత్య కథనాన్ని ప్రచురించారంటూ ఫిర్యాదు చేయగా ఈ ఫిర్యాదు విషయంలో సాక్షి ఏ విధంగా రియాక్ట్ అవుతుందో చూడాల్సి ఉంది. తిరుమల లడ్డూ వివాదం విషయంలో స్వతంత్ర సిట్ ఇచ్చే రిపోర్ట్ ఎన్నో మలుపులకు కారణమవుతుందని చెప్పడంలో ఎలాంటి సందేహం అక్కర్లేదు. తిరుమల టీటీడీ లడ్డూ  వివాదం విషయంలో భిన్న వాదనలు తెరపైకి వస్తుండటం కూడా ప్రస్తుతం  సోషల్ మీడియా వేదికగా ఒకింత సంచలనం అవుతుందని చెప్పవచ్చు.


 


మరింత సమాచారం తెలుసుకోండి: