తెలుగుదేశం కూటమి ప్రభుత్వంలోనూ పార్టీలోనే సగానికి పైగా భారాన్ని నారా లోకేశ్ చంద్రబాబుకు తగ్గించేస్తున్నారు. ఆయనే పార్టీలో బాధ్యతలను ఎక్కువగా తీసుకుంటున్నారు అని ప్రచారం సాగుతోంది. గతంలో టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు రెండేళ్ల పాటు నారా లోకేశ్ మంత్రిగా పనిచేశారు. అయితే ఈ మధ్య కాలంలో ప్రతిపక్షంలో ఆయన బాగా రాటు దేలారు.


దాంతో పాటు పార్టీ ప్రభుత్వంలో పట్టుని బాగా పెంచుకున్నారు. అన్ని విషయాల మీద అవగాహన కూడా పెరిగింది. యువగళం పేరుతో భారీ పాదయాత్ర చేయడం వల్ల కూడా ఆయనకు ఏపీలోని ఉమ్మడి పద మూడు జిల్లాలో పార్టీ నేతలతో డైరెక్ట్ కనెక్షన్ ఏర్పడింది. క్షేత్ర స్థాయిలో వాస్తవాలు తెలిశాయి. పార్టీ కేంద్ర కార్యాలయంలో కూర్చొని ఎవరు ఏమిటి ఏ జిల్లాలో ఎవరు ఏ విధంగా పనిచేస్తారు, జిల్లాలో పార్టీ పరిస్థితి ఏంటి అన్నది మొత్తం ఆయన తన మెదడులోనే నిక్షిప్తం చేసుకున్నారని అంటున్నారు.


ఇక లోకేశ్ క్యాడర్ కి లీడర్ కి బాగా అందుబాటులో ఉంటారని పేరు తెచ్చుకున్నారు. ఆయనకు కలవాలని అనుకున్న వారిని నిరుత్సాహపరచరు. తన వద్దు ప్రతీ రోజూ వచ్చే పార్టీ నేతలను కలుసుకొని ఆదరించి.. వారి సమస్యలను అడిగి తెలుసుకొని తగిన పరిష్కారాలు చూపడం ద్వారా టీడీపీలో అందరికీ లోకేశ్ ఒక పెద్ద దిక్కుగా మారారు అని అంటున్నారు.


ఇప్పుడు లోకేశ్ ఒక సరికొత్త కేంద్రంగా మారారు అని.. చంద్రబాబు సైతం బాధ్యతలను కుమారుడికి అప్పగించారని అంటున్నారు. పార్టీలో నేతలు అంతా ఈ విధంగా లోకేశ్ కు దగ్గరకు వస్తూ తమ నియోజకవర్గ సమస్యలను చెప్పుకోవడంతో పాటు తమ మనసులోని ఆంక్షలను బయట పెడుతున్నారంట. ఇక నామినేటేడ్ పోస్టుల గురించి.. పార్టీ పదవుల గురించి చాలా మంది నేతలు కలుస్తున్నారు అని టాక్ వినిపిస్తోంది. ఇదే సమయంలో లోకేశ్ పార్టీ ఫ్యూచర్ లీడర్ గా ఎదుగుతున్నారని విశ్లేషకులు అంటున్నారు. ఆయన అపాయిట్ మెంట్ కోసం చాలా మంది నాయకులు ఎదురుచూస్తున్నారు అని.. ఇది ఆయనే జీవింతలో ఒక కీలక మైలురాయి అని అభివర్ణిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: