ఈ తరుణంలోనే... సమంత కోపంతో విడాకులు ఇచ్చిందని కొండా సురేఖ వ్యాఖ్యానించడం జరిగింది. దీనిపై అక్కినేని నాగార్జున కోర్టుకు కూడా వెళ్లారు. కొండా సురేఖ పై 100 కోట్ల పరువు నష్టం దావా కూడా వేయడం జరిగింది. ఈ కేసు ప్రస్తుతం కోర్టు పరిధిలో ఉన్నప్పుడు... కొండా సురేఖకు సంబంధించిన లాయర్ సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు. నిన్నటి నుంచి ఆ లాయర్ మాట్లాడిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
అక్కినేని నాగార్జునను ఉద్దేశించి మంత్రి కొండా సురేఖ తరపు న్యాయవాది వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం జరిగింది. అక్కినేని నాగార్జునను ఇక ఎవరు కాపాడలేరని.. ఆయనకు వ్యతిరేకంగా కేసులు వేయబోతున్నామని హెచ్చరించారు న్యాయవాది. ఒక మహిళా, బీసీ సామాజిక మంత్రిని పట్టుకొని అక్కినేని నాగార్జున కేసులు వేయడం దారుణం అన్నారు. ఈ కుట్ర వెనుక కేటీఆర్ ఉన్నాడని కూడా ఆ న్యాయవాది ఆరోపణలు చేశారు.
అంతేకాదు బిగ్ బాస్ షో తో అక్కినేని నాగార్జున అక్రమాలు చేస్తున్నారని కూడా ఆయన మండిపడ్డారు. అక్కినేని నాగార్జున ఈ బిగ్ బాస్ పేరుతో.. కోట్లు సంపాదిస్తున్నాడని కూడా ఆయన పేర్కొనడం జరిగింది. అసభ్యకరమైన సన్నివేశాలు ఈ బిగ్ బాస్ షో లో ఉంటున్నాయని... ఒకరిపై ఒకరు పడుకుంటారని కూడా ఆయన పేర్కొన్నారు. దీంతో బిగ్ బాస్ షో పై రేవంత్ రెడ్డి... బ్యాన్ విధించే అవకాశాలు ఉన్నట్లు సోషల్ మీడియాలో చర్చ జరుగుతుంది. సమంత వివాదాన్ని బిగ్ బాస్ వరకు తీసుకుపోవడంతో ఈ కొత్త అంశం తెరపైకి వచ్చింది.