భారతదేశవ్యాప్తంగా బీజేపీ పార్టీకి ఎదురుగాలి వీస్తున్నట్లు స్పష్టంగా అర్థం అవుతోంది. మొన్న జరిగిన పార్లమెంటు ఎన్నికల నుంచి ఇప్పటివరకు చూసుకున్నట్లయితే ప్రతి చోట... మోడీ ప్రభుత్వానికి ఇబ్బందులు ఎదురవుతున్నట్లు స్పష్టంగా మనకు అర్థమవుతుంది. చంద్రబాబు అలాగే నితీష్ కుమార్.. ఇద్దరి కారణంగానే మొన్న.. కేంద్రంలో మోడీ ప్రభుత్వం మూడోసారి ఏర్పాటు కావడం జరిగింది. అంటే ఇక్కడే మనకు అర్థమవుతుంది... బిజెపికి దేశవ్యాప్తంగా ఎదురుగాలి.. వియ్యడం మొదలైందని అనుకోవచ్చు.

 

అయితే ఈ నేపథ్యంలోనే.. ఇప్పటివరకు ఎన్డీఏ కూటమికి సపోర్ట్ గా నిలిచిన చాలా పార్టీలు... ఇండియా కూటమి వైపు వెళ్లేందుకు సిద్ధమవుతున్నాయి. దేశ ప్రస్తుత పరిస్థితులను బట్టి...బిజెపి కంటే కాంగ్రెస్ బెటర్ అని కొంతమంది భావిస్తున్నారు. ఇందులో భాగంగానే ఇప్పుడు నవీన్ పట్నాయక్... ఇండియా కూటమి వైపు అడుగులు వేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో.. ఒడిస్సా లో దారుణంగా ఓడిపోయింది బిజు జనదల్ పార్టీ.

 

అప్పటివరకు మోడీకి సపోర్ట్ చేసిన నవీన్ పట్నాయక్ పార్టీని ఓడించింది బిజెపి. దీంతో ఒడిశా రాష్ట్రంలో మొన్నటి ఎన్నికల్లో బిజెపి అధికారంలోకి రావడం జరిగింది. ఇక 147 స్థానాలు ఉన్న ఒడిస్సా శాసనసభలో 51 స్థానాలకు  నవీన్ పట్నాయక్ పార్టీ పరిమితమైంది. ఇక మొన్నటికి మొన్న లోక్సభ ఎన్నికల్లో.. కెసిఆర్ పార్టీ ఎదుర్కొన్న పరాభావాన్ని ఆయన ఎదుర్కొన్నారు. బి జె డి పార్టీ... లోక్సభ ఎన్నికల్లో ఖాతా కూడా తెరవలేదు. జీరో కే పరిమితమైంది.

ఇక..  మొన్నటి 9 రాజ్యసభ స్థానాలు నవీన్ పట్నాయక్ చేతిలో ఉండేవి. ఇద్దరూ ఎంపీలు బిజెపి పార్టీలో చేరిపోయారు. దీంతో ఏడు స్థానాలకు పడిపోయింది నవీన్ పట్నాయక్ పార్టీ. ఈ నేపథ్యంలో ఇండియా కూటమితో చేతులు కలిపేందుకు సిద్ధమవుతున్నారు నవీన్ పట్నాయక్. ఇక బిజెపిని నమ్మి మోసపోయానని...  దేశంలో ప్రత్యామ్నాయంగా రాహుల్ గాంధీ కనిపిస్తున్నారని ఆయన అటువైపుగా అడుగులు వేస్తున్నారట.


మరింత సమాచారం తెలుసుకోండి: