ఇక అలానే ప్రొద్దుటూరు , రాజంపేట మున్సిపాలిటీలో పరిస్థితి కూడా ఇంతే. చివరగా కడప మేయర్ స్థానంలో టిడిపికి అధికారకంగా ఒక్క కార్పొరేటర్ మాత్రమే ఉన్నారు. ఇప్పుడు సీన్ అంతా మారిపోయింది కార్పొరేటర్లంతా టిడిపిలోకి రావడానికి సై అంటున్నారు. జగన్ సొంత జిల్లాలోనే ఇంత దారుణంగా ఉంటే .. అయిన ఎమ్మెల్యేగా ఉన్న పులివెందుల మున్సిపల్ కౌన్సిలర్లు కూడా టిడిపి వైపు చూస్తున్నారు. ప్రధానంగా గతం అధికారంలో ఉన్నప్పుడు జగన్ వారికి ఎన్నో కాంట్రాక్టర్లు ఇచ్చారు. కానీ వాటికి సంబంధించిన బిల్లులు మాత్రం ఇవ్వలేదు. ఇప్పుడు పార్టీ కోసం కాకపోయినా బిల్లుల కోసమైనా టిడిపిలోకి వెళ్ళిపోతామని వారు సంకేతాలు పంపుతున్నారు. టిడిపి నుంచి ఇంకా ఎలాంటి సంకేతాలు రాలేదు.
ఇక కడప జడ్పీ చైర్మన్ పీఠం కూడా వైసీపీ నుంచి చేయి జారిపోతుంది.. అందుకు ప్రత్యేకంగా జగన్ జడ్పీటీసీలు అందర్నీ తాడేపల్లి పిలిపించుకుని బతిమాలుకున్నారు ..తన పరువు తీయొద్దని అడిగి మరి... వారికి తల ఓ తైలం కూడా ప్రకటించారు. ఇలా చెప్పుకుంటూ పోతే వైసీపీని ముందు నూంచి నడిపించే నాయకుడే కడప జిల్లాలో కనుమరుగైపోయారు. ఇప్పుడు చివరికి పార్టీ జిల్లా అధ్యక్షుడిగా తన మేనమామ రవీంధ్రనాథ్ రెడ్డిని నియమించగా ఆ నిర్ణయమే అయనకు మరింత తలనొప్పులు తీసుకొచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.