ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తమిళ రాజకీయాలపై గురి పెట్టారా.. అంటే అవునన‌నే సమాధానాలు వినిపిస్తున్నాయి రాజకీయ వర్గాల నుంచి..  తెలంగాణతో పాటు తమిళనాడులో కూడా రాజకీయ ఎంట్రీని పవన్ ప్లాన్ చేస్తున్నారు.. ఇలా పవన్ ఆలోచనలు, ఆయన ఆసక్తి చూస్తుంటే
అవుననే అంటున్నారు విశ్లేషకులు. తమిళనాడు అంటే సిద్ధులు , సాధువులు నడిచిన‌ పవిత్ర భూమిని.. తన తండ్రి రామకృష్ణ పరమహంస, శారదా మాత , వివేకానంద లకు అమితమైన భక్తుడంటూ ఎక్స్ వేదిక చేసిన పోస్ట్ ఇప్పుడు జాతీయ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది.


ఇక తమిళనాడుతో తనకున్న అనుబంధాన్ని, తమిళనాడు చరిత్ర తెలుసుకునే విధానాన్ని పవన్ పోస్టులు పెడుతున్నారని కూడా భావిస్తున్నారు. తాజా గానే సనాతన ధర్మ విషయంలో తమిళనాడు సీఎం స్టాలిన్ తో పాటు ఆయన కుమారుడు ఉదయనిది స్టాలిన్ పైన కూడా ఆయన ఘాటు వ్యాఖ్యలు చేశారు. అంతే కాకుండా తమిళనాడులో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్న తనదైన రీతులో పవన్ స్పందిస్తూ వస్తున్నారు.. అలాగే తమిళనాడు సీఎం స్టాలిన్ కు సనాతన ధర్మంతో చెక్ పెట్టాలనే వ్యూహంతో పవన్ ముందుకు కదులుతున్నారని కూడా అంటున్నారు. అలానే పవన్ వ్యూహాల వెనుక బిజెపి పెద్దల హస్తం కూడా ఉందని టాక్ కూడా నడుస్తుంది.


అంతేకాకుండా రాబోయే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో అక్కడ బిజెపి అధ్యక్షుడు అన్నామలై తో కలిసి ఎన్నికల్లో  పాల్గొని అక్కడ జనసేన నుంచి పోటీ పెట్టాలని కూడా నిర్ణయించుకున్నట్టు పవన్ తెలుస్తుంది. ప్రస్తుతం ఇప్పటి వరకు రాజకీయాల్లో ఉన్న ఏ సినీ నటులు ఇలాంటి వైవిధ్యమైన నిర్ణయాలు తీసుకోలేదు.. ఇక తమ మతానికి ఎక్కువ ప్రాధాన్య తీస్తే వేరే మతం వాళ్లు నచ్చుకుంటారని ఉద్దేశంతో సినీ నటులు ఎవరు పెద్దగా ఇలాంటి ఇష్యులపై మాట్లాడరు కానీ  పవన్ కళ్యాణ్ మాత్రం సనాతన ధర్మం పరిరక్షణ అంటూ కార్య రంగంలోకి దిగారు మరోవైపు ఇతర మతాలకు ఏదైనా సమస్య వస్తే తాను ముందు ఉంటానని కూడా చెప్తున్నారు. అయితే ఎప్పుడూ పవన్ తీసుకున్న ఈ నిర్ణయం జాతీయ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: