హర్యానా రాష్ట్రంలో... ఎవరు ఊహించని ఫలితాలు వెలుపడ్డాయి. వాస్తవంగా హర్యాన రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని అందరూ ఊహించుకున్నారు.అదే సమయంలో.. దాదాపు అన్ని ఎగ్జిట్ పోల్స్ కూడా కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా వచ్చాయి. దానికి తగ్గట్టుగానే ఇవాళ ఉదయం... కౌంటింగ్ ప్రారంభమైనప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీ లీడింగ్ లో కనిపించింది. కానీ ఉదయం 10 గంటల సమయం వచ్చేసరికి... సీన్ మొత్తం రివర్స్ అయింది.


భారతీయ జనతా పార్టీ మళ్ళీ లీడింగ్ లోకి రావడం మనం చూశాం. ఉదయం నుంచి సాయంత్రం వరకు అదే లీడింగ్ కొనసాగించింది భారతీయ జనతా పార్టీ. దీంతో ముచ్చటగా మూడోసారి హర్యానా రాష్ట్రంలో కాషాయ జెండా ఎగురవేసింది. వాస్తవంగా హర్యానా రాష్ట్రంలో 90 సీట్లు ఉన్నాయి.ఇందులో 48 అసెంబ్లీ స్థానాలను భారతీయ జనతా పార్టీ గెలుచుకోవడం జరిగింది. అటు కాంగ్రెస్ పార్టీకి 37 స్థానాలు వచ్చాయి. ఇతరులకు ఐదు స్థానాలు దక్కాయి.


హర్యానా రాష్ట్రంలో ఆమ్ ఆద్మీ పార్టీ ఖాతా తెరువలేదు. అయితే హర్యానా రాష్ట్రంలో బిజెపి పార్టీ ఓటమి నుంచి బయటపడడానికి...అగ్ని వీర్,  దళితుల విషయంలో కీలక నిర్ణయాలు తీసుకొని సక్సెస్ అయింది. కానీ కాంగ్రెస్ మాత్రం.. సోషల్ మీడియాలో కాంగ్రెస్ వస్తుందనే వార్తను మాత్రమే నమ్మి గుడ్డిగా ముందుకు వెళ్ళింది. అలాగే కర్ణాటక ఇటు తెలంగాణలో... గ్యారెంటీ ల పేరుతో కాంగ్రెస్ గారడీ చేసిన సంగతి తెలిసిందే.  కర్ణాటకలో ఐదు గ్యారంటీలు ప్రకటించి.. అధికారం  వచ్చిన తర్వాత...ప్రజలను పట్టించుకోలేదు కాంగ్రెస్. దానికి తోడు సీఎం సిద్ధరామయ్య స్కాం లో ఇరుక్కున్నాడు.


ఇటు తెలంగాణలో... ఆరు గ్యారంటీలు ప్రకటించి.. ప్రజలను దారుణంగా మోసం చేసింది. అయితే ఈ అంశం దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ అయింది. అదే సమయంలో హర్యానా రాష్ట్రంలో ఏడు గ్యారంటీలు అంటూ కాంగ్రెస్ ముందుకు వచ్చింది. కానీ అక్కడి ప్రజలు...కాంగ్రెస్ పార్టీని అస్సలు నమ్మలేదు. కర్ణాటక అలాగే తెలంగాణ ప్రజల లాగా..చేయకుండా భారతీయ జనతా పార్టీకి అవకాశం ఇచ్చారు.తెలంగాణ అలాగే కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను అమలు చేసి ఉంటే...హర్యానాలో పరిస్థితి వేరేలా ఉండదని...రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఈ తరుణంలోనే.. రాహుల్‌గాంధీని జిలేబీ తో పోల్చుతూ.. పోస్టులు పెడుతోంది బీజేపీ.

మరింత సమాచారం తెలుసుకోండి: