ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు శరవేగంగా మారుతున్నాయి. 2029 ఎన్నికల్లో నారా లోకేశ్ ను సీఎం చేయాలని చంద్రబాబుతో పాటు బాలయ్య, బాలయ్య కుటుంబ సభ్యులు సైతం భావిస్తున్నారు. నారా లోకేశ్ ఈ ఎన్నికల్లో భారీ మెజార్టీతో ఎమ్మెల్యేగా గెలవడంతో పాటు రాజకీయాల్లో తనదైన శైలిలో రాణిస్తున్నారు. గతంలో తనపై వచ్చిన విమర్శలు రిపీట్ కాకుండా ఆయన జాగ్రత్త పడుతున్నారు.
 
అయితే నారా లోకేశ్ కు డిప్యూటీ సీఎం పదవి ఇవ్వాలనే డిమాండ్ సర్వత్రా వ్యక్తమవుతోంది. ప్రస్తుతం ఏపీకి పవన్ మాత్రమే డిప్యూటీ సీఎంగా ఉన్నారనే సంగతి తెలిసిందే. అయితే లోకేశ్ కు పవన్ తో సమానంగా హోదా కల్పిస్తే బాగుంటుందని టీడీపీ అభిమానులు అభిప్రాయపడుతున్నారు. బాలయ్య కుటుంబం నుంచి కూడా ఈ మేరకు చంద్రబాబుపై ఒత్తిడి ఉందని సమాచారం అందుతోంది.
 
ప్రస్తుతం ఏపీలో లోకేశ్ సూచనలకు అనుగుణంగానే రాజకీయాలు జరుగుతున్నాయని కూడా కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. లోకేశ్ తీసుకున్న నిర్ణయాలకు టీడీపీలో తిరుగులేదని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. లోకేశ్ కు డిప్యూటీ సీఎం పదవి దక్కితే ఆయన మరింత మెరుగ్గా నిర్ణయాలు తీసుకునే ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పవచ్చు. నారా లోకేశ్ ను డిప్యూటీ సీఎం చేసి పవన్ తో సమానంగ హోదా కల్పించాలని చంద్రబాబు సైతం భావిస్తున్నారని పొలిటికల్ వర్గాల టాక్.
 
లోకేశ్ ను కూడా డిప్యూటీ సీఎం చేస్తే జనసేనకు భారీ షాక్ తగిలినట్టేనని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. చంద్రబాబు ఈ దిశగా నిర్ణయం తీసుకుంటారో లేదో తెలియాలంటే మరి కొంతకాలం ఆగాల్సిందే. చంద్రబాబు నాయుడు రాబోయే రోజుల్లో ఎలా ప్లాన్ చేసుకుంటారో చూడాల్సి ఉంది. నారా లోకేశ్ డిప్యూటీ సీఎం పదవి దక్కితే ఆ పదవికి పూర్తిస్థాయిలో న్యాయం చేస్తారని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. నారా లోకేశ్ పొలిటికల్ గా అంతకంతకూ ఎదగాలని చంద్రబాబు నాయుడు భావిస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: