హర్యానా రాష్ట్రంలో ఎవరు ఊహించని ఫలితం వచ్చింది. వాస్తవంగా అందరూ కాంగ్రెస్ గెలుస్తుందని అనుకున్నారు. కానీ తీరా చూసేసరికి సీన్ రివర్స్ అయింది. హర్యానా రాష్ట్రంలో బిజెపి పార్టీ అఖండ విజయాన్ని నమోదు చేసుకోవడం జరిగింది.  48 స్థానాలు దక్కించుకున్న భారతీయ జనతా పార్టీ... హర్యానా రాష్ట్రంలో కొత్త ప్రభుత్వాన్ని మూడోసారి ఏర్పాటు చేయబోతుంది. వస్తావంగా హర్యాన రాష్ట్రంలో అన్ని ఎగ్జిట్ పోల్స్... కాంగ్రెస్కు అనుకూలంగా ఇవ్వడం జరిగింది.


కానీ.. ఫలితాలు వచ్చేసరికి బిజెపికి అనుకూలంగా మారాయి.  అచ్చం ఆంధ్రప్రదేశ్లో జరిగినట్లుగానే హర్యాన రాష్ట్రంలో జరిగాయి అన్నమాట. అయితే హర్యానా రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల పైన సర్వే కూడా నిర్వహించారు కేకే. మొన్నటి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల  సందర్భంగా కేకే సర్వే సంస్థ హాట్... టాపిక్ అయిన సంగతి తెలిసిందే. కేకే చెప్పినట్లుగానే వైసిపి పార్టీకి 11 స్థానాలు... కూటమికి 160 కి పైగా స్థానాలు వచ్చాయి.


దీంతో అందరూ కేకే సర్వే ను మెచ్చుకోవడం జరిగింది. అయితే హర్యానా ఎగ్జిట్ పోల్స్ లో కూడా కేకే ఒక అంచనా వేసింది. హర్యానా రాష్ట్రంలో కచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి...  65 స్థానాలు వస్తాయని... ప్రకటించింది కేకే సంస్థ. లీడింగ్ లో బిజెపి ఉన్నా కూడా... లైవ్ డిబేట్లో కేకే ఇదే విషయాన్ని ప్రకటించారు. కానీ కేకే సర్వే కూడా తప్పైపోయింది. అక్కడ భారతీయ జనతా పార్టీ అఖండ విజయాన్ని నమోదు చేసుకుంది.


దీంతో కేకే సర్వే సంస్థ పని కూడా ఆరా మస్తాన్ లాగా తయారైందని కొంతమంది సోషల్ మీడియాలో ట్రోలింగ్ చేస్తున్నారు. ఆరా మస్తాన్ కూడా ఏపీలో జగన్మోహన్ రెడ్డి పార్టీ వస్తుందని.. ఆయనకు తిరుగులేదని... ఎగ్జిట్ పోల్స్ సందర్భంగా ప్రకటించారు. కానీ రిజల్ట్స్ వచ్చేసరికి ఆరా మస్తాన్ లెక్కలు తారుమారయ్యాయి. దీంతో... అప్పటి నుంచి సర్వేలకు దూరంగా ఉంటోంది ఆరా మస్తాన్. ఇక ఇప్పుడు కేకే సర్వే సంస్థ పని కూడా అదే అయింది. ఆయన కూడా సర్వేలకు దూరం కాబోతున్నారని సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది.  అయితే ఈవీఎంలు ఉన్నన్ని రోజులు సర్వే సంస్థల లెక్కలు పనిచేయవని.. కొంతమంది కామెంట్ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: