అయితే ఇలాంటి అంశాల నేపథ్యంలో... ఏపీలో మరో బాంబు లాంటి వార్త వచ్చి పడింది. భారతీయ జనతా పార్టీలో జనసేన పార్టీ విలీనం కాబోతున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. అతి త్వరలోనే భారతీయ జనతా పార్టీలో జనసేన విలీనం అవుతుందని... అయితే జెమిలి ఎన్నికలు నిర్వహించే ముందే ఇది జరుగుతుందని కొంతమంది భావిస్తున్నారు. జాతీయ మీడియాలో కూడా దీనిపైన ప్రత్యేక కథనం కూడా వచ్చింది.
భారతీయ జనతా పార్టీలు జనసేన పార్టీ విలీనం అయితే... పవన్ కళ్యాణ్ ఎంపీగా పోటీ చేయబోతారని... ప్రచారం జరుగుతుంది. జమిలి ఎన్నికలు 2026 సంవత్సరం నాటికి...జరుగుతాయని ఆలోపు... ఈ విలీన ప్రక్రియ ముగిస్తుందని... చర్చ జరుగుతుంది. విలీనం అయిన తర్వాత కాకినాడ లేదా అనకాపల్లి నుంచి ఎంపీగా పవన్ కళ్యాణ్ పోటీ చేసే ఛాన్సులు ఉన్నాయని చెబుతున్నారు. ఎలాగూ పవన్ కళ్యాణ్ గెలుస్తాడని పూర్తి నమ్మకం లో... జనసేన ఉందట.
ఎంపీగా పవన్ కళ్యాణ్ గెలిస్తే కేంద్రమంత్రి చేస్తారని కూడా చెబుతున్నారు ఒకవేళ ఆయన గెలవకపోయినా రాజ్యసభ పదవి ఇచ్చే ఛాన్స్ ఉందట. ఏపీలో బిజెపి పార్టీ పూర్తిస్థాయిలో బలంగా పాతుకు పోవాలని... మోడీ అనుకుంటున్నారట. టిడిపి స్థానాన్ని భర్తీ చేసేందుకు ఆయన ప్లాన్ వేస్తున్నట్లు సమాచారం. దానికోసం పవన్ కళ్యాణ్ వాడుకుంటున్నట్లు చెబుతున్నారు. అందుకే ఈ మధ్యకాలంలో సనాతన ధర్మం అంటూ పవన్ కళ్యాణ్ రెచ్చిపోవడం ఇందులో భాగమే అంటున్నారు.