తాజాగా ఏపీ బీజేపీ నేత వీడియో కూడా బయటకు వచ్చింది. ఓ మహిళతో రాసలీలల గురించి మాట్లాడుతూ.. రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయాడు బిజెపి నేత. ఆయన ఎవరో కాదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గుంటూరు జిల్లా బిజెపి అధ్యక్షుడు వనామా నరేంద్ర కుమార్. ఈ గుంటూరు బిజెపి అధ్యక్షుడు వనామా నరేంద్ర కుమార్ కు సంబంధించిన ఓ వీడియో కాల్ సోషల్ మీడియాలో రచ్చ చేస్తోంది. ఒక మహిళతో అసభ్యకరంగా వీడియో కాల్ మాట్లాడుతూ... దొరికిపోయాడు ఈ బీజేపీ నేత.
రేపు వస్తావా లేదా ఇవాళ నైట్ వస్తావా... అంటూ ఆ మహిళతో.. గుంటూరు బిజెపి జిల్లా అధ్యక్షుడు వనమా నరేంద్ర కుమార్ మాట్లాడిన... మాటలు కూడా వేరేలా అవుతున్నాయి. అంతేకాదు రేపు మందు కొడదాం... పోయినసారి లాగా చేసేద్దాం అంటూ.... రెచ్చిపోయి మాట్లాడాడు. అయితే ఈ వీడియోను వైసీపీ సోషల్ మీడియా బాగా వాడుకుంటుంది. కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత... ఇలాంటి రాసలీలలు... వరుసగా బయటపడుతున్నాయని వైసీపీ నేతలు ఆరోపణలు చేస్తున్నారు.
ఇటీవల టిడిపి ఎమ్మెల్యే ఆదిమూలం బెడ్ రూమ్ వీడియో వైరల్ అయిన సంగతి తెలిసిందే. ఓ మహిళను మూడు రోజులపాటు మూడు గదుల్లో... రేప్ చేసాడట ఎమ్మెల్యే ఆదిమూలం. ఆ వీడియోను స్వయంగా బాధితురాలు బయట పెట్టింది. దీంతో టిడిపి పార్టీ నుంచి ఆదిమూలంను సస్పెండ్ చేశారు. కోర్టుకు వెళ్లిన ఈ కేసు... అక్కడే ముగిసింది. బాధితురాలు అలాగే ఎమ్మెల్యే మధ్య కాంప్రమైజ్ రాజకీయం రావడంతో.. ఈ వివాదం సద్దుమయింది. ఇంతలోనే బిజెపి జిల్లా అధ్యక్షుడి వీడియో బయటపడడంతో రచ్చ జరుగుతుంది.