ఈ క్రమంలో స్క్రాపింగ్ కోసం రాష్ట్రంలో 37 కొత్త టెస్టింగ్ సెంటర్లను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.సొంత వెహికల్ 15 ఏండ్లు దాటిన తర్వాత వలంటీర్గా స్క్రాపింగ్ కోసం ఇస్తే సర్టిఫికెట్ ఆఫ్డిపాజిట్ వస్తుందని ట్రాన్స్పోర్ట్ కమిషనర్ ఇలంబర్తి తెలిపారు. వచ్చే రెండేండ్లలో అదే రేంజ్లో కొత్త వాహనం కొంటే దాని ఎంవీ టాక్స్ లో మినహాయింపు ఉంటుందని వివరించారు. పాత బకాయిలు ఉన్నా వెహికల్ స్క్రాప్ కి తీసుకెళ్తే వన్ టైం సెటిల్మెంట్ చేసేలా కూడా అవకాశం ఉందని చెప్పారు. ప్రభుత్వం 37 ఆటో మేటెడ్ టెస్టింగ్ సెంటర్స్ పెట్టుకోవడానికి అనుమతి ఇచ్చిందని, జిల్లాలో 33, హైదరాబాద్ లో 4 అదనంగా పెట్టనున్నట్టు చెప్పారు.ఒక్కో దానికి రూ.8 కోట్లు అవసరం అవుతుండగా.. మొత్తం రూ. 296 కోట్లు కేటాయించినట్టు తెలిపారు. సారథి, వాహన్ సాఫ్ట్వేర్ను ఏడాదిలోపు మొత్తం ఇంప్లిమెంట్ చేస్తామని, సాఫ్ట్ వేర్ అప్ గ్రేడ్ జరుగుతున్నదని చెప్పారు. 15 ఏండ్లు దాటిన ప్రైవేట్ వాహనాలను కచ్చితంగా స్క్రాపింగ్ చేసుకోవాలనే కండిషన్ లేదని, వారి ఇష్టపూర్వకంగానే చేసుకోవచ్చునని తెలిపారు. ట్రాన్స్ పోర్ట్ వాహనాలకు 8 ఏండ్లలోపు ప్రతి ఏటా, త్రైమాసికంలో పన్నుపై 10 శాతం రాయితీ ఇస్తారన్నారు. 15 ఏండ్లు దాటిన వాహనాలు స్క్రాప్ కి పంపించకుండా రిజిస్ట్రేషన్ మళ్లీ చేసుకోవాలంటే అదనంగా ట్యాక్స్ కట్టాల్సి ఉంటుందని వెల్లడించారు.