ఈ ప్రపంచంలో అటు పుతిన్ తో ఇటు జెలన్ స్కీతో మాట్లాడిన ఏకైక నాయకుడు భారత ప్రధాని మోదీ. ఈ మాటలు అన్నది ఎవరో కాదు మన విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్. ఉన్నది ఉన్నట్లు ముఖం మీద చెప్పే వ్యక్తి జైశంకర్. ఇక రెండున్నరేళ్లుగా జరగుతున్న ఉక్రెయిన్, రష్యా యుద్ధంలో  ప్రపంచ దేశాల్లో ఎక్కువ మంది ఉక్రెయిన్ వైపు నిలిచారు. దీనికి కారణం నాటో.


అయితే చైనా, ఉత్తర కొరియా, ఇరాన్ మాత్రం రష్యాను సమర్థించాయి. అత్యంత సంక్లిష్టమైన ఈ పరిస్థితుల్లో భారత్ మాత్రం అద్భుతమైన నిలకడ ప్రదర్శించింది. చివరకు తాము తటస్థ పక్షం కూడా కాదని.. శాంతి పక్షం అని చెప్పింది. యుద్ధం మొదలైన తర్వాత ఉక్రెయిన్ కు అమెరికా అధ్యక్షుడు, బ్రిటన్ ప్రధాని సహా పలు నాటో, నాటోయేతర దేశాల నాయకులు సందర్శించారు. అయితే  వీరెవరూ రష్యాను సందర్శించలేదు. కారణం బద్ధ శత్రుత్వమే.


ఇక రష్యాలో ఉత్తర్ కొరియా అధ్యక్షుడు కిమ్, చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ మాత్రమే వెళ్లారు. అయితే అటు రష్యాకు, ఇటు ఉక్రెయిన్ కు వెళ్లిన ఏకైక ప్రధాని మన మోదీనే. అది కూడా రష్యా వెళ్లిన నెలన్నర రోజుల్లోనే..


ఇక ఇజ్రాయెల్, హమాస్ యుద్ధం ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంలో ఇజ్రాయెల్ మాజీ ప్రధాని ఎహుద్ ఓల్మెర్ట్ కీలక వ్యాఖ్యలు చేశారు. దీనిని ముగించాలనే పిలుపునకు ప్రధాని మోదీ మద్దతు ఇస్తారని భావిస్తున్నట్లు చెప్పారు. అంతర్జాతీయ నాయకుల్లో మోదీ ముఖ్యుడు అని అన్నారు. ఇజ్రాయెల్-హమాస్ సమస్యను పరిష్కరించేందుకు భారత్ మద్దతు అవసరం. భారత్ అపారమైన ముఖ్యమైన, గౌరవనీయ దేశం. యుద్ధం ముగింపునకు ఆ దేశ నాయకత్వం మాకు అవసరం అని ఆయన పేర్కొన్నారు. ఇక గతంలోను రష్యా, ఉక్రెయిన్ అధ్యక్షులు కూడా తమ విషయంలో ప్రధాని మోదీ కలుగజేసుకోవాలని ఇరు దేశాల అధ్యక్షులు కోరారు.

మరింత సమాచారం తెలుసుకోండి: