రతన్ టాటా ఈ యువకుడిని తన వ్యక్తిగత సహాయకుడుగా, వ్యాపార జనరల్ మేనేజర్‌గా నియమించుకున్నారు. ఇప్పుడు శంతనుకు 29 ఏళ్లు. ఆయన 2022 మే నుంచి రతన్ టాటా దగ్గర పని చేస్తున్నాడు. అంతేకాకుండా, శంతను గారు ‘గుడ్‌ఫెలోస్’ అనే స్టార్టప్ కంపెనీని నడుపుతున్నారు. ఈ కంపెనీ విలువ 5 కోట్ల రూపాయలు. ఈ కంపెనీ వృద్ధులకు సహాయం చేసే సేవలను అందిస్తుంది. రతన్ టాటా గారితో కలిసి శంతను జన్మదినం జరుపుకున్న వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయినప్పుడు చాలామంది శంతను గురించి తెలుసుకున్నారు.
శంతను నాయుడు ముందుగా ఒక ఎన్జీఓ ద్వారా వీధి కుక్కలకు ఆహారం పెడుతూ చాలామంది దృష్టిలో పడ్డాడు రతన్ టాటా శంతను చేసిన ఈ మంచి పనిని చూసి ఆయనను తన కంపెనీలో అధికారిగా నియమించుకున్నారు. అంతేకాకుండా, వీధి కుక్కల కోసం శంతను చేస్తున్న పనికి రతన్ టాటా డబ్బు కూడా ఇచ్చి సహాయం చేశారు. శంతను పుణెలో పుట్టి పెరిగాడు. ఆయన సవిత్రిబాయి ఫూలే పుణే విశ్వవిద్యాలయం నుండి ఇంజనీరింగ్ చదివి, తర్వాత కార్నెల్ యూనివర్సిటీ నుండి ఎంబీఏ చేశాడు. తన కెరీర్‌ను టాటా ఎల్‌ఎక్సీ అనే కంపెనీలో కార్లు డిజైన్ చేసే ఇంజనీర్‌గా ప్రారంభించాడు.
శంతను స్ట్రీట్ డాగ్స్ ప్రమాదాలకు గురికాకుండా ఉండేందుకు ఒక చక్కటి ఆలోచన చేశాడు. అతను కుక్కలకు రిప్లై టు కాలర్లు తయారు చేయించాడు. ఈ కాలర్లు వేసుకున్న కుక్కలను రాత్రి వేళ కూడా కారు నడిపే వారు దూరం నుండి చూడగలరు. దీంతో కుక్కలు ప్రమాదాలకు గురి కాకుండా కాపాడవచ్చు. శంతను చేసిన ఈ మంచి పని చూసి రతన్ టాటా చాలా ఆనందించారు. ఎందుకంటే రతన్ టాటా కూడా జంతువులను చాలా ఇష్టపడతారు. శంతను కుక్కలను ఎంతగా ప్రేమిస్తున్నాడో చూసి ఆయనకు చాలా ఆనందం వేసింది. అందుకే శంతనుతో మరింత దగ్గరయ్యారు. చివరికి అతనే ఆయన బాగోగులు చూసుకుని తన రుణం తీర్చుకున్నాడు.