- ( అమ‌రావ‌తి - ఇండియా హెరాల్డ్ ) . .

- ఆలయాల్లో ఇతరుల జోక్యం లేకుండా అర్చకులకు స్వయం ప్రతిపత్తి కల్పిస్తూ ఉత్తర్వులు
- వైదిక విధుల్లో దేవాదాయ కమిషనర్ సహా ఏ అధికారి జోక్యం చేసుకోవద్దని ఆదేశాలు
- ఆధ్యాత్మిక విధుల విషయంలో అర్చకులదే తుది నిర్ణయమని స్పష్టం చేసిన ప్రభుత్వం


ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చి మూడు నెల‌లు దాటుతోంది. ఈ క్ర‌మంలోనే ఒక్కో విష‌యంలో ఇప్పుడిప్పుడే నిర్ణ‌యాలు తీసుకుంటోంది. ఈ క్ర‌మంలోనే కీల‌క‌మైన దేవాదాయ శాఖ‌లో కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఇది నిజంగా ఆల‌యాల్లో ప‌నిచేసే అర్చ‌కుల‌ను హీరోల‌ను చేసింది. వాళ్ల‌కు ప‌వ‌ర్ ఫుల్ అధికారాలు ఇచ్చింది. అస‌లు విష‌యంలోకి వెళితే దేవాల‌యాల్లో ప‌నిచేసే పూజారుల‌కు దూప దీప నైవేధ్యాల‌కు నేరుగా నిధులు ఇవ్వాల‌ని కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చిన వెంట‌నే నిర్ణ‌యాలు తీసుకుంది.


ఇక ప్ర‌భుత్వం తీసుకున్న తాజా నిర్ణ‌యం ప్ర‌కారం ఇక‌పై ఆల‌యాల లో ఇత‌రుల జోక్యం లేకుండా చూడాల‌ని డిసైడ్ అయ్యింది. అక్క‌డ అర్చ‌కుల‌కు స్వ‌తంత్య్ర ప్ర‌తిప‌త్తి క‌ల్పిస్తూ ఉత్త‌ర్వులు జారీ కూడా చేసింది. వైదిక విధుల‌లో దేవాదాయ క‌మిష‌న‌ర్ తో పాటు ఏ అధికారి జోక్యం చేసుకోవ‌ద్ద‌ని ఆదేశాలు జారీ చేసింది. ఆధ్యాత్మిక విధుల విష‌యం లో అర్చ‌కుల‌దే తుది నిర్ణ‌యం అని ప్ర‌భుత్వం స్ప‌ష్టం చేసింది.


అయితే ఇక్క‌డే ఓ మెలిక కూడా పెట్టింది. అవసరమైతే ఈవోలు వైదిక కమిటీలు వేసుకోవచ్చని ప్రభుత్వం వెల్లడించింది. ఆధ్యాత్మిక విషయాల్లో ఏకాభిప్రాయం కుదరకపోతే పీఠాధిపతుల సలహాలు తీసుకోవాలని ప్రభుత్వం సూచన  చేసింది. ఆలయాల్లో ఆగమ శాస్త్రాల ప్రకారమే వైదిక విధులు నిర్వహించాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. ఏదేమైనా ప్ర‌భుత్వం తీసుకున్న ఈ నిర్ణ‌యం నిజంగా ఆల‌యాల్లో ప‌ని చేస్తోన్న పూజారుల‌కు తిరుగులేని అధికారాలు క‌ట్ట‌బెట్టింది.. పూజ‌లు .. ఆల‌యాల్లో పూజా నిబంధ‌న‌లు ఇక‌పై పూజాల‌రు ఇష్ట ప్ర‌కార‌మే పూర్తిగా చేసుకోవ‌చ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: