- ( అమ‌రావ‌తి - ఇండియా హెరాల్డ్ ) . .


మామూలుగా ఆంధ్రజ్యోతి అంటే తెలుగుదేశం తెలుగుదేశం అంటే ఆంధ్రజ్యోతి అన్న నానుడి ఎప్పటినుంచో ఉంది. గతంలో దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ... ఆ తర్వాత ఆయన తనయుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి ఇద్దరు కూడా పదేపదే ఈనాడు - ఆంధ్ర జ్యోతి పేర్లు ప్రస్తావిస్తూ ఆ రెండు పత్రికలు ... కుల పత్రికలు తెలుగుదేశం అనుకూల పత్రికలు అంటూ విమర్శలు చేసేవారు. ఇక గత ఎన్నికలలో ఓటమి ప్రభుత్వం విజయం సాధించి అధికారంలోకి వచ్చింది. ఆంధ్రజ్యోతి - ఈనాడు తెలుగుదేశం గెలుపు కోసం గట్టిగా కృషి చేశాయి .. అక్కడి వరకు బాగానే ఉంది. అయితే ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఎక్కడ తేడా కొట్టిందో ఏమో కానీ ఆంధ్రజ్యోతి కూటమి ప్రభుత్వంపై కక్ష కట్టినట్టుగా కథనాలు ప్రచురిస్తోంది. అయితే ఒక్కోసారి ఆంధ్రజ్యోతి జర్నలిస్టులు సిల్లీగా వ్యవహరిస్తున్నారు అన్న విమర్శలు కూడా వస్తున్నాయి.


ఓ వార్డు సచివాలయంలో జగన్ బొమ్మ ఉన్న పత్రాలతో ధృవపత్రం ప్రింట్ చేసి ఇవ్వ‌గా... అది అక్క‌డ ఉద్యోగి నిర్ల‌క్ష్యం.. అయితే రాష్ట్రం అంతా అంతే ఉందన్నట్లుగా ఆ ఒక్క పత్రం పట్టుకుని ఆంధ్రజ్యోతి ఏకంగా మెయిన్ పేజ్ స్టోరీ రాసి ప‌డేసింది. వాస్త‌వానికి జగన్ రెడ్డి వదిలిపోయిన అలాంటి నిర్వాకాలను చాలా వ‌ర‌కు కూట‌మి ప్ర‌భుత్వం వ‌దిలించింది. కానీ ఆంధ్రజ్యోతి స్టోరీ రాసిన ఈ ఒక్క స్టోరీ వల్ల వైసీపీ హవా ఇంకా ప్రభుత్వంలో ఉందని చెప్పడం ప్రారంభించారు.


అక్క‌డితో ఆగ‌లేదు.. జ్యోతి ప‌త్రిక‌లో ప్ర‌తి రోజు ప్రభుత్వం లోని వైసీపీ అధికారులు అంటూ ప్రతి రోజూ.. ఎవరో ఒకరి గురించి రాస్తూనే ఉంటున్నారు. కూట‌మి సర్కార్ కు …. ఇంకా అధికారుల్లో పట్టుచిక్కలేదని.. అడ్మినిస్ట్రేషన్ ఘోరంగా ఉందన్న భావన టీడీపీ వర్గాల్లోకి ఆంధ్రజ్యోతి పంపేలా క‌థ‌నాలు వేసుకుంటూ వ‌స్తోంది. కొన్ని క‌థ‌నాల్లో వాస్త‌వం ఉన్నా... ఎక్క‌డ తేడా కొట్టిందో కాని.. జ్యోతి క‌క్ష క‌ట్టుకుని నాన్ మెచ్యూర్డ్ కథనాలతో.. టీడీపీ ప్రభుత్వం… అడ్మినిస్ట్రేషన్ లో వెనుకబడిపోయిందన్న ప్రచారం ఎక్కువుగా జ‌ర‌గ‌డానికి కార‌ణంగా క‌నిపిస్తోంది. మ‌రి జ్యోతి ఈ విష‌యం లో కావాల‌ని కూట‌మి ప్ర‌భుత్వాన్ని ఎందుకు టార్గెట్ చేస్తుందో అర్థం కావ‌డం లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: